
బుల్లితెర అందాల భామ రష్మీ గౌతమ్ కు షాక్ ఇచ్చాడు కిట్టు ఉన్నాడు జాగ్రత్త దర్శకుడు. బుల్లితెర పై హొయలు పోతూ కుర్రకారు గుండెల్లో గుబులురేపుతున్న ఈ భామకు వెండితెర పై చాలానే ఛాన్స్ లు వస్తున్నాయి దాంతో రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా పట్టుబడుతోందట. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో మొదట రష్మీ ని ఐటెం సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారట దర్శక నిర్మాతలు. రేష్మీ కూడా ఒప్పుకుంది అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పట్టుబట్టడంతో రష్మీ స్థానంలో మరో హాట్ భామ హంసా నందినిని ఫిక్స్ చేశారట టీమ్.
మిర్చి లాంటి సాంగ్స్ చేసి హంసా నందిని హీరోయిన్ అవుదామనుకుంది పాపం కానీ ఆ భామకు ఐటెం భామగా సెక్సీ ఇమేజ్ రావడంతో హీరోయిన్ ఛాన్స్ లు పోయి ఐటెం సాంగ్స్ వస్తున్నాయి . సాలిడ్ ఫిగర్ తో పిచ్చిలేపే హంసా ఐటెం సాంగ్ చేస్తే మరింతగా యూత్ ని ఆకట్టుకోవడం ఖాయమని నమ్మకంగా ఉన్నారట ఆ చిత్ర దర్శక నిర్మాతలు .