క్యాన్సర్ ని జయించిన నటి హంసానందిని.. మునుపటిలా బీచ్ లో హాట్ లుక్ తో సర్ప్రైజ్

Published : Feb 24, 2023, 10:10 PM IST
క్యాన్సర్ ని జయించిన నటి హంసానందిని.. మునుపటిలా బీచ్ లో హాట్ లుక్ తో సర్ప్రైజ్

సారాంశం

టాలీవుడ్ లో హంస నందిని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు.

టాలీవుడ్ లో హంస నందిని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు. అయితే హంసానందిని 2021లో ఆశ్చర్యకరంగా క్యాన్సర్ బారీన పడ్డ సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుని హంసా నందిని గత ఏడాది కోలుకుంది. 

అయితే క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది. ఈ విషయాన్ని తెలియాజేస్తూ హంసా నందిని ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఏడాది క్రితం జుట్టు లేకుండా.. ఏడాది తర్వాత జుట్టుతో ఎలా ఉన్నానో తెలియజేస్తూ వీడియో షేర్ చేసింది. 

కంప్లీట్ హాట్ లుక్ లోకి మారిన హంసా నందిని తిరిగి సినిమాల్లోకి సై అంటోంది. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తన లేటెస్ట్ గ్లామర్ లుక్ ని బయట పెట్టింది. ప్రస్తుతం తన ఫీలింగ్ చాలా బావుందని తెలియజేస్తూ కామెంట్ పెట్టింది. 

నెటిజన్లు కూడా హంసా నందిని తిరిగి కోలుకోవడం, పూర్తి ఎనెర్జిటిక్ గా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హంసా నందిని రియల్ ఫైటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. మీ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. 

హంసా నందిని.. అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం, లెజెండ్ లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించింది. మంచి ఆఫర్ వస్తే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?