
ఆపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే పెళ్లి చేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహెల్ కథురియాని డిసెంబర్ 4న జైపూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని గడుపుతూనే, సినిమాలు చేస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే హన్సిక పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో పూర్తి ప్రైవేట్‌గా జరిగిన విషయం తెలిసిందే. కొన్ని ఫోటోలు తప్ప మరేదీ బయటకు రాలేదు. కారణం పెళ్లి వేడుకని ఓటీటీకి అమ్మేయడమే.
పెళ్లి వీడియో హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కి ఇచ్చారు. దీంతో వాళ్లు హన్సిక జంటపై వీడియోతోపాటు డాక్యుమెంటరీ చేశారు. తాజాగా ఆ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో పెళ్లికి ముందే సోహెల్.. హన్సిక ఫోటోని తన చేతిపై టాటూగా వేయించుకున్నారు. టాటూ వేసే టైమ్‌లో హన్సిక ఫోన్ చేసింది. సోహెల్ చేస్తున్న పని చూసి షాక్ అయ్యింది.
ఈ సందర్భంగా హన్సిక స్పందిస్తూ, ఒక ఇంజెక్షన్ తీసుకోవడానికే బాధ పడతాను, అలాంటిది సోహెల్ నా పేరునే టాటూగా వేయించుకుంటున్నాడు అని తెలిపింది హన్సిక. ఈ సందర్భంగా సోహెల్ కూడా తన బాధని వ్యక్తం చేశాడు. దానికి మరింత చలించిపోయింది హన్సిక. ఈ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యింది. వీరిద్దరు పెళ్లికి ముందు చాలా రోజులుగా ప్రేమించుకున్నారు. గతంలోనూ ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడిపిస్తుందనే వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు హన్సిక. కానీ డైరెక్టర్‌గా ప్రియుడిని పరిచయం చేసి పెద్ద షాకిచ్చింది.
పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద హన్సికకి లవ్ ప్రపోజ్ చేశాడు సోహెల్. ఆ ఫోటోలను పంచుకుంటూ అది ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అంటూ తన ఆనందాన్ని పంచుకుంది హన్సిక. ఇక కెరీర్ పరంగా చూస్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హన్సిక `దేశముదురు` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. తొలి చిత్రమే పెద్ద బ్లాక్ బస్టర్ కావడం విశేషం.
ఆ తర్వాత టాప్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఎన్టీఆర్‌తో `కంత్రి`, ప్రభాస్‌తో `బిల్లా`, రామ్‌తో `మస్కా`, `కందిరీగ`, కళ్యాణ్ రామ్‌తో `జయీభవ`, నితిన్‌తో `సీతారాముల కళ్యాణం`, మంచు విష్ణుతో `దేనికైనా రెడీ`, `పాండవులు పాండవులు తుమ్మెద`, రవితేజతో `పవన్`, సందీప్ కిషన్‌తో `తెనాలి రామకృష్ణ` వంటి సినిమాలు చేస్తుంది. క్రమంగా తెలుగు తగ్గించి కోలీవుడ్ వైపు మొగ్గు చూపింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పుడు తెలుగులో `105మినిట్స్`, `మై నేమ్ ఈజ్ శృతి` చిత్రాలు చేస్తుంది.