
హంసా నందిని టాలీవుడ్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్ తో పాటు.. హాట్ సీన్స్ తో అదరగొట్టిన ఈ భామ ఇటీవలే బ్రెస్ట్ కేన్సర్ బారిన పడింది.ఇక తాజాగా తన ట్రీట్ మెంట్ గురించి.. ప్రస్తుతం పరిస్థితి గురించి అప్ డేట్ చేసింది స్టార్ బ్యూటీ.
బ్యూటీఫుల్ టాలీవుడ్ స్టార్ హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి నానా అవస్తలు పడుతుంది. అయినా సరే పెదవిపై చిరునవ్వు మాత్రం చెరగనివ్వడం లేదు హంసా. ఇక తన ఆరోగ్యం గురించి తాజా పరిస్థితిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది హంసా నందిని. తాను కీమో థెరపీని ఎట్టకేలకు గట్టెక్కినట్టు ప్రకటించింది.
కాన్సర్ ట్రీట్ మెంట్ లో భాగంగా కీమో థెరపీ ను కంప్లీట్ చేసుకున్నారు హంసా నందిని. ఇన్ స్టాలో ఈ విషయం చెపుతూ.. డాక్టర్ ఆనంద్ 16 సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. నేను ఇప్పుడు అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ ట్రీట్ మెంట్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తదుపరి పోరాటానికి రెడీ కావాల్సిన తరుణం ఇది. ఇక సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ.. హంసా నందిని ఇన్ స్టాలో ప్రకటించారు. వీటితో పాటు హస్పిటల్ లో తాను ఉన్న ఫోటోస్ ను కూడా శేర్ చేసుకున్నారు హంస.
హంసా నందిని అమ్మ కూడా బ్రెస్ట్ కేన్సర్ తోనే మరణించారు. అదే మహమ్మారి హంసాకూ సోకింది. చిరునవ్వుతో పోరాడతాను, విజయం సాధిస్తానంటూ ఆమె లోగడ ప్రకటించడం సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. తలపై వెంట్రుకలు పూర్తిగా తొలగించి గుండుతొ ఉన్న ఫొటోను 2021 డిసెంబర్ లో షేర్ చేస్తూ తాను కేన్సర్ బారిన పడినట్టు హంసా నందిని ప్రకటించింది. కోల కళ్లతో కుర్ర కారుకు కిర్రెక్కించే బ్యూటీ.. ఇలా కాన్సర్ మహమ్మారికి చిక్కడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు.