
హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పండంటి బిడ్డకి జన్మనిచ్చేందుకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సిద్ధమవుతోంది. కాజల్ అగర్వాల్ గర్భవతి అయినప్పటి నుంచి ముంబైలోనే ఉంటోంది. తన భర్త గౌతమ్ కచ్లుతో, ఫామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతోంది. ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోంది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ జంట తన ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ పైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఏరోబిక్ మరియు స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలు చేస్తోంది. ఈ మేరకు జిమ్ లో ఏరోబిక్ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుంది.
ప్రెగ్నెన్సీ ఎక్సర్‌సైజ్ వీడియోను షేర్ చేస్తూ.. కాజల్ ఇలా రాసింది, ‘నేను ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటాను. నా జీవితమంతా వర్క్ అవుట్ చేస్తూనే ఉన్నారు. ప్రెగ్నెన్సీ అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. ఎలాంటి సమస్యలు లేకుండా గర్భవతి అయిన మహిళలందరూ ఏరోబిక్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా శరీరాన్ని మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్ సైజ్ తో నాకు మరింత బలం చేకూరుతోంది. గర్భధారణలో ఏరోబిక్ కండిషనింగ్ లక్ష్యం మామూలుగా ఉంటే సరిపోతుంది.. పీక్ ఫిట్‌నెస్ ను చేరుకోవాలని ప్రయత్నించకూడదు’ అని పేర్కొంది.
మరో వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘మీకు మీరు యోగ్యులు, సమర్థులు, మీకు మీరే ఉత్తమ వెర్షన్. మీకిష్టమైన ప్రదేశానికి టికెట్ బుక్ చేసుకోండి. ఒక పుస్తకం రాయండి, మీ కలను సృష్టించండి, మీ రాజ్యాన్ని మీరే పాలించండి’ అంటూ వాల్యూబుల్ వర్డ్స్ చేప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఈ వీడియోను చూసిన అమలాపాల్ (Amalapaul) రెడ్ హార్ట్ ఎమోజీలను వదిలిచింది. ఇక కాజల్ అగర్వాల్ నటించిన ‘హే సినామిక’ మూవీ మార్చి 3న తమిళం, తెలుగులో రిలీజ్ కానుంది. మరోవైపు మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీతో పాటు తమిళంలో మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. హిందీలోనూ ‘ఉమా’ చిత్రానికి కూడా సైన్ చేసింది.