
మహేశ్ బాబు తాజా చిత్రం 'గుంటూరు కారం' ప్రారంభమైన నాటి నుంచి ఏదో వార్తతో తరచూ మీడియాలో హెడ్ లైన్ గా ఉంటూ వస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రిలీజ్ కు రెడి చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్‌గా చేస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత షూటింగ్ షెడ్యూల్, స్క్రిప్ట్, మరిన్నీ మార్పుల కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అది నిజమే అని తెలిసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఈ రూమర్లపై స్పందించారు. పూజాహెగ్డే రీప్లేస్ వార్తలపై మాట్లాడుతూ.. ఆమె మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చిందని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని వివరించారు. మహేశ్‌బాబు ఈ సినిమాలో భిన్నంగా కనిపిస్తారని, పండుగకు వచ్చే సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. సంక్రాంతికి పక్కాగా ఈ సినిమాను విడుదల చేస్తామని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ వస్తుందని చెప్పారు.
ఇక కొన్ని కారణాలతో గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నత్తనడకన సాగింది. షూట్ చేసిన కొన్ని సీన్స్ కూడా రీషూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాపై ఉన్న హైప్ తో రికార్డు బిజినెస్ చేస్తోంది. నైజాం లో ఈ సినిమా హక్కుల కోసం ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు మొదటి నుంచి ఫస్ట్ రేస్ లో ఉన్నారు. మరి తాజా సమాచారం ప్రకారం అయితే తాను ఏకంగా 45 కోట్ల మొత్తంతో అయితే తాను ఒక్క నైజాం హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.