
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమాలుకు ఎంచుకునే థీమ్స్, వాటినుంచి వచ్చే వివాదాలు వేరుగా ఉంటాయి. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ సినిమా ఇంపాక్ట్ ఏ స్దాయిలో ఉందో కలెక్షన్స్ బట్టి చెప్పచ్చు. పాన్ ఇండియా సినిమాలకు పోటీగా విడుదలై కశ్మీర్ ఫైల్స్ మూవీ రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. కేవలం రూ. 15 – 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. కేవలం లాభాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పలు వివాదాలకు తెరలేపింది. దాంతో ఆయన నెక్ట్స్ సినిమా ‘ది వాక్సిన్ వార్’పై అందరి దృష్టీ పడింది.
‘ది వాక్సిన్ వార్’సినిమాను సెప్టెంబర్ 28న వాక్సిన్ వార్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. కాగా.. ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసిన వివేక్.. సలార్ కి పోటీగా వాక్సిన్ వార్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి ఆశ్చర్య పరిచాడు. కశ్మీర్ ఫైల్స్ కూడా.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కి పోటీగా రిలీజ్ చేసాడు. అదే విధంగా ‘ది వాక్సిన్ వార్’తో సలార్ ని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28న వాక్సిన్ వార్ ని అనౌన్స్ చేసి షాకిచ్చాడు.
కానీ.. ఊహించని విధంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుండి వాయిదా పడటంతో ... వాక్సిన్ వార్ పోటీ లేకుండా రిలీజ్ అయ్యింది. అదే మైనస్ అయ్యిందంటున్నారు. ది వ్యాక్సిన్ వార్ సినిమాకు ఐదు రోజుల్లో ఎనిమిదికోట్లు కోట్లు కూడా రాలేదు. మొదటి రెండు రోజులు కోటి కూడా రాలేదు. అదే సమయంలో రిలీజ్ అయ్యిన ఫక్రీ అయితే ఈ మూడు రోజుల్లోనే ముప్పై కోట్లు కొల్లగొట్టింది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజును విడుదలైన కూడా కలెక్షన్లలో మాత్రం చాలా తేడా ఉంది.
సలార్ సినిమాకు పోటీగా రిలీజ్ అయ్యి ఉండి ఉంటే ..అసలు ఈ సినిమా గురించి కొద్దో గొప్పే మాట్లాడేవారు అంటున్నారు. అయితే సలార్ వలనే ది వ్యాక్సిన్ వార్ పోయిందని చెప్పుకునేందుకు మాత్రం వీలుండేదని కొందరు కామెంట్ చేయటం గమనార్హం. సినిమా గొప్ప కంటెంట్ తో ఉన్నా అంత పరమ బోరింగ్ సినిమాను ఎప్పుడు చూడలేదు అని వివేక్ అగ్నిహోత్రిని ట్రోల్ చేస్తున్నారు.
ఇక సలార్ వాయిదా పడ్డాక వాక్సిన్ వార్ బజ్ తగ్గిపోయిందనేది నిజం. జనాలు కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవడం మానేశారు. సలార్ పోటీలో ఉంటే.. ఆ సినిమాకు పోటీగా వస్తుందనే బజ్ అయినా ఉపయోగపడేది. కానీ.. సలార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని ట్రేడ్ టాక్.