`గుంటూరు కారం` కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

Published : Jan 14, 2024, 01:33 PM IST
`గుంటూరు కారం` కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

సారాంశం

మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. సంక్రాంతి కానుకగా విడులైన ఈ మూవీకి రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

మహేష్‌ బాబు ఈ సంక్రాంతికి `గుంటూరు కారం` చిత్రంతో వచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలైంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్మురేపుతుంది. తొలి రోజులు భారీగా వసూలు చేసింది. ఏకంగా 94 కోట్లు కలెక్ట్ చేసింది. మహేష్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టింది. సంక్రాంతి కావడం, అడ్వాన్స్ బుకింగ్స్ తో ఫస్ట్ డే గట్టిగా కొట్టింది. 

ఇక రెండు రోజు తగ్గాయి. నిన్న వెంకటేష్‌ `సైంధవ్‌` మూవీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం కలెక్షన్లపై పడింది. రెండో రోజు కేవలం 33కోట్లు చేసింది. దీంతో ఇప్పుడు రెండు రోజుల్లో ఈ మూవీ 127కోట్లకు చేరుకుంది. సినిమా టాక్‌కి, కలెక్షన్లకి సంబంధం లేకుండా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీపై విపరీతమైన నెగటివ్‌ ట్రోల్స్ జరిగాయి. మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఈ మూవీని ట్రోల్‌ చేశారు. నెగటివ్‌ ప్రచారం చేశారు. ఇది కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. 

ఇక ఈ మూవీ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో మహేష్‌బాబుకే సుమారు 70-80కోట్లు వరకు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తుంది. ఇక మూవీ దాదాపు 130కోట్ల బిజినెస్ అయ్యింది. నైజాంలోనే నాలభై కోట్లకుపైగా బిజినెస్‌ జరిగిందని సమాచారం. దిల్‌ రాజు ఈ మూవీ హక్కులను దక్కించుకున్నారు. మరి ఫుల్ రన్‌లో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందా అనేది చూడాలి. 

మహేష్‌ బాబు సినిమాలో ఇరగదీశాడు. ఆయన పాత్ర హైలైట్‌గా నిలిచింది. కానీ కథ వీక్‌గా ఉండటం మైనస్‌గా చెబుతున్నారు. కామెడీ సీన్లు బాగా పేలాయి. పాటల ఆకట్టుకున్నాయి. కానీ కొన్ని ల్యాగ్‌ సీన్లు, అనవసరమైన సీన్లు సినిమాకి నెగటివ్‌గా మారాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటించింది. మీనాక్షి చౌదరి మరో పాత్రలో మెరిసింది. మదర్‌ సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. రమ్యకృష్ణ అమ్మగా చేసింది. ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, జయరాం కీలక పాత్రలు పోషించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?