
మహేష్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో వచ్చేస్తోంది. సూపర్ స్టార్ బర్తడే సెలబ్రేషన్స్ కు ఫ్యాన్స్ చాలా ప్లాన్స్ చేసుకున్నారు. మరి ఫ్యాన్స్ కు గిప్ట్ గా ఇవ్వటానికి ఆయన ఏం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంటే మహేష్ నిర్మాతలు అని అర్దం. మహేష్, తాజా చిత్రం గుంటూరు కారం నుంచి త్రివిక్రమ్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం నుండి థమన్ మ్యూజిక్ లో ఫస్ట్ సింగిల్ మహేష్ బర్త్ డే కి వదలబోతున్నారనే టాక్ ఉంది. ఆ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే అసలు అలాంటిదేమీ ఉండదు. కేవలం ఓ పోస్టర్ వదిలి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తారు అని టాక్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. ఇది అభిమానులను నిరాశపరిచే విషయం.
ఇది గుర్తించి గుంటూరు కారం మేకర్స్ కూడా ఫాన్స్ లో ఎలాంటి క్యూరియాసిటీ కలిగించే ఎర్పాట్లు ఇంకా మొదలు పెట్టలేదు. ఇంత సైలెంట్ గా మహేష్ బర్త్ డే వేడుకలకి దగ్గరవడం అటు ఫాన్స్ కి బాధగానే ఉంది. మరోపక్క మహేష్ వీటితో తనకేమి సంబంధం లేదు అన్నట్టుగా ఫ్యామిలీతో కలిసి స్కాట్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే భార్య పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో మహేష్ తన పుట్టిన రోజు వేడుకలని జరుపుకోబోతున్నారు. దాంతో అభిమానులు బిజినెస్ మ్యాన్ రీరిలీజ్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రీరిలీజ్ ట్రెండ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చిత్రం ది బిజినెస్ మ్యాన్. . ఈ సినిమా 2012లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టిక్కెట్ల కోసం థియేటర్స్ వద్ద క్యూలు కడుతున్నారు.
ఇక ఇప్పటికే మహేష్ ఒక్కడు మూవీ రీరిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ రాగా, తాజాగా బిజినెస్ మెన్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేసారు. ఆగస్టు9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ మూవీలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా, మహేష్ ని డిఫరెంట్ గా చూపించిన క్రెడిట్ ఆయనకే దక్కిందిఇక ఈ సినిమాలో మహేష్ సూర్య భాయ్ అనే పాత్ర పోషించారు. చేతిలో రూపాయి కూడా లేకుండా ముంబయి నగరంలోకి అడుగుపెట్టి, ఆయన చివరకు ఆ ముంబయినే శాశించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే ఈమూవీ కథ.