గుణ శేఖర్ షాక్ ఇచ్చాడే...సురేష్ బాబు ఏమంటారో..?

Surya Prakash   | Asianet News
Published : Oct 10, 2020, 11:54 AM IST
గుణ శేఖర్ షాక్ ఇచ్చాడే...సురేష్ బాబు ఏమంటారో..?

సారాంశం

ప్రస్తుతానికి ఆ 'హిరణ్యకశ్యప'ను పక్కనపెట్టి 'శాకుంతలం' పేరిట ఆయన ఓ ప్రేమకావ్యాన్ని రూపొందించడానికి రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన టైటిల్ ని, మోషన్ పోస్టర్ని  ఆయన విడుదల చేశారు.

కమర్షియల్ చిత్రాలను  కళాత్మకంగా తీయగలడన్న పేరు  తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. గతంలో ఆయన  రూపొందించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఒక్కడు వంటి సూపర్ హిట్స్ ఆయన నుంచి వచ్చాయి. అలాగే ఆ మధ్యన  అనుష్క ప్రధాన పాత్రలో 'రుద్రమదేవి' చారిత్రాత్మక కథా చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారు.

ఈ క్రమంలో తన తదుపరి చిత్రంగా రానా దగ్గుబాటి టైటిల్ పాత్రధారిగా 'హిరణ్యకశ్యప' పేరిట పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేసారు. అయితే, ప్రస్తుతానికి ఆ 'హిరణ్యకశ్యప'ను పక్కనపెట్టి 'శాకుంతలం' పేరిట ఆయన ఓ ప్రేమకావ్యాన్ని రూపొందించడానికి రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన టైటిల్ ని, మోషన్ పోస్టర్ని  ఆయన విడుదల చేశారు.

https://youtu.be/h9uq0er6rZY

"వెండితెరపై 'హిరణ్య కశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ.." అని పేర్కొంటూ,  గుణశేఖర్ ఈ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో శకుంతల పోట్రైట్ తో ఈ మోషన్ పోస్టర్ రమణీయంగా వుంది. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

PREV
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?