సింగం-3 సినిమాలో 365 సీన్లున్న‌యా

Published : Dec 10, 2016, 02:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సింగం-3 సినిమాలో 365 సీన్లున్న‌యా

సారాంశం

మాములుగా ఒక సినిమాలో 100 సీన్ల‌కు మించి ఉండ‌వు కాని సిగం-3లో 365 సీన్లున్న‌య‌ట‌ 365 సీన్ల‌తో డైరెక్ట‌ర్ హ‌రి ఎం మ్యాజిక్ చేశాడో మ‌రి

 

 అన్నేసి సన్నివేశాలతో సినిమా తీస్తే ఏడెనిమిది గంటలైనా నిడివి అవుతుంది. ఐతే ‘సింగం సిరీస్ లో వస్తున్న మూడో సినిమా ‘సింగం-3’లో రెగ్యులర్ సినిమాల నిడివిలోనే ఇన్ని సన్నివేశాలూ పట్టించేస్తున్నారట.మామూలుగా హరి సినిమాలంటే జెట్ స్పీడుతో ఉంటాయి. ప్రతి సన్నివేశం పరుగులు పెడుతుంటుంది. కెమెరా ఎక్కడా ఒక చోట ఆగదు.

  ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కు.. ఒక సన్నివేశం నుంచి ఇంకో సన్నివేశానికి షార్ప్ గా వెళ్లిపోయాలా ఎడిటింగ్ చేయిస్తాడు హరి. ఐతే ఎంత వేగం చూపించినా.. ఎలా ఎడిట్ చేసినా 365 సీన్లను ఒక్క సినిమాలో పట్టించడం.. రెగులర్ రన్ టైం తీసుకురావడం అంటే ఊహకందని విషయమే. మరి హరి ‘ఎస్-3’ కోసం ఏం మ్యాజిక్ చేశాడో చూడాలి.

 ఈ నెల 23నే తమిళ.. తెలుగు భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘ఎస్-3’. సూర్య సరసన శ్రుతి హాసన్.. అనుష్క ఇందులో కథానాయికలుగా నటించారు.
 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?