గోపీచంద్ ‘పక్కా కమర్షియల్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

Surya Prakash   | Asianet News
Published : Nov 11, 2021, 07:57 PM ISTUpdated : Nov 11, 2021, 07:59 PM IST
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

టైటిల్‌కి తగ్గట్టు సినిమాలో కమర్షియల్‌ హంగులు పక్కాగా ఉన్నాయని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. కోర్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. 

గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌–యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సీటీమార్ తర్వాత గోపీ చంద్ హీరోగా వస్తున్న మరో సినిమా పక్కా కమెర్షియల్. హిలేరియస్ కామెడి చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తోన్న పక్కా కమెర్షియల్ మూవీ టీజర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ టీజర్ బాగా వర్కవుట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించింది టీమ్.  

మార్చి 18న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ తో ప్రకటన చేసింది. . టైటిల్‌కి తగ్గట్టు సినిమాలో కమర్షియల్‌ హంగులు పక్కాగా ఉన్నాయని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. కోర్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. దర్శకుడు మారుతి ఈసారి కూడా మాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా, ప్రతీ ఒక్కరూ మెచ్చేలా కామెడి ప్లస్ యాక్షన్ కలిపి ప్యాకేజ్ రెడీ చేసారనిపిస్తోంది. గోపీచంద్ హీరోయిజం ఎక్స్‌ట్రీమ్ లెవెల్లో చూపిస్తూ.. అతడిని మరింత స్మార్ట్‌గానూ చూపించినట్టు పక్కా కమెర్షియల్ టీజర్ చూస్తే అర్థమవుతోంది. 

 

మరి లాయరైన గోపీచంద్‌ విలనిజం గురించి చెప్తూ ఎవరికి వార్నింగ్‌ ఇచ్చారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.  ‘‘ఔట్‌ అండ్‌  ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్‌కేఎన్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాబు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సత్యగమిడి, సంగీతం: జేక్స్‌ బిజాయ్, కెమెరా: కమర్‌ చావ్ల.  
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే