మొత్తానికి ‘జాతిరత్నాలు’హీరోయిన్ ని గుర్తించారు

By Surya PrakashFirst Published Nov 11, 2021, 7:56 PM IST
Highlights

 రెగ్యులర్ స్టార్ హీరోయిన్లకు భిన్నమైన లుక్, నటనతో ఆమె స్పెషల్ గా కనిపించింది ‘జాతిరత్నాలు’లో. ఆ సినిమా పెద్ద హిట్ అవటంతో అందరూ ఆమె దశ తిరిగిపోతుందని భావించారు. కానీ అదేమీ జరగలేదు.

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతి ర‌త్నాలు...లో హీరోయిన్‌గా  ఫరియా అబ్దుల్లా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది. రెగ్యులర్ స్టార్ హీరోయిన్లకు భిన్నమైన లుక్, నటనతో ఆమె స్పెషల్ గా కనిపించింది ‘జాతిరత్నాలు’లో. ఆ సినిమా పెద్ద హిట్ అవటంతో అందరూ ఆమె దశ తిరిగిపోతుందని భావించారు. కానీ అదేమీ జరగలేదు.

ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా కూడా తను ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను అని చెప్పింది కానీ అలాంటిదేమీ కూడా జరగలేదు. ఇంతకముందు మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఫరియా ఎంపికైందనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని రవితేజ సినిమాలలో హీరోయిన్స్‌ను చూశాక క్లారిటీ వచ్చింది.  అఖిల్ హీరోగా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో చిన్న క్యామియో లాంటి రోల్ మినహాయిస్తే ఫరియా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ అవకాశం అందుకోలేదు.

అయితే ఎట్టకేలకు ఫరియాకు ఓ పేరున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోయే ‘డి అండ్ డి’కి ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారట.  శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు 'డి అండ్ డి' అనే సినిమా చేస్తున్నారు. 'డబుల్ డోస్' అనే క్యాప్షన్‌తో తెరకెక్కబోతున్న ఇందులో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేసుకున్నట్టు దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ప్రకటించారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. 

ఇక ఢీ సినిమా గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ.. 'ఢీ' కథ, ఈ సీక్వెల్‌ కథ రెండూ వేర్వేరని తెలిపాడు. కాకపోతే 'ఢీ'లో ఉండే కొన్ని క్యారెక్టర్లను మాత్రం సీక్వెల్‌లో వాడుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. గత సినిమాల్లోని తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానన్నాడు. 'ఢీ అండ్‌ ఢీ'ని 24 ఫ్యాక్టరీ ఫిలింస్‌ పతాకంపై హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. గోపీమోహన్, కిషోర్‌ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్‌ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌.
 

click me!