Hero Gopichand : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీ హీరో గోపిచంద్.. ప్రత్యేక పూజలు

Published : Apr 19, 2022, 10:24 PM IST
Hero Gopichand : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీ హీరో గోపిచంద్.. ప్రత్యేక పూజలు

సారాంశం

హీరో గోపీచంద్ (Gopi Chandh), డైరెక్టర్ మారుతీ ఈ రోజు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. వీరి కాంబినేషనల్ లో వస్తున్న తాజా చిత్రం విజయవంతం అవ్వాలని ప్రత్యేక  పూజలు చేశారు.   

గోపీచంద్‌(Gopichand) ఇటీవల `సీటీమార్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. వరుస పరాజయాల అనంతరం వచ్చిన `సీటీమార్‌` ఆయనకు మంచి బూస్ట్ నిచ్చింది. మరోవైపు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి(Maruthi) దర్శకత్వంలో గోపీచంద్‌ సినిమా చేస్తుండటం విశేషం. వీరి కాంబినేషన్‌లో `పక్కా కమర్షియల్‌`(Pakka Commercial Movie) సినిమా రూపొందుతుంది. అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. 

`పక్కా కమర్షియల్‌` చిత్రంతో రాశీఖన్నా(Raashi Khanna) కథానాయిక. `జిల్‌` తర్వాత గోపీచంద్‌, రాశీఖన్నా కలిసి నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. చిత్ర టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం మరో విశేషం. ఈ మధ్యే విడుదలైన `పక్కా కమర్షియల్` టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జులై 1,2022న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. 

అయితే, జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈ రోజు  హీరో గోపిచంద్, నిర్మాత మారుతీతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానాలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారుతి నిర్మాతగా నూతనంగా గోపిచంద్ హీరోగా నిర్మితమైన సినిమా విజయవంతం కావాలని నృసింహునీ దర్శించి నట్లు  మారుతి తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం ఆలయ ఆశీర్వచన మంటపంలో వేద ఆశీస్సులు అందచేశారు అర్చకులు. గోపిచంద్, మారుతి లను స్వామీ వారి శేషవస్త్రంతో ఈవో  శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. అనంతరం గోపిచంద్ అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌