
నిరంతరం ప్రేక్షకుల ఇష్టాలని వారి ముందుంచే మనందరి అభిమాన ఛానల్ `జీ తెలుగు`(Zee Telugu) ఈ సారి కూడా వినోదం పంచడంలో తగ్గేదేలే అంటుంది. ఈ ఆదివారం అందరి సాయంత్రాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి వచ్చేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) నటించిన హిట్ మూవీ `వలిమై`(Valimai) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో 5: 30 గంటలకు, అలాగే `స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్` (Sarigamapa) ఎలిమినేషన్ ఎపిసోడ్ రాత్రి 9: 00 గంటలకు ప్రసారం కాబోతున్నాయి.
ఎప్పుడూ కొత్త సినిమాలతో అందరిని ఉత్తేజపరిచే జీ తెలుగు ఈ ఆదివారం సాయంత్రం 5: 30 గంటలకు అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా `వలిమై`తో వస్తుంది. కథ విషయానికి వస్తే, వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పేరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో, వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.
ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. అజిత్ స్టయిలీష్ నటన, కార్తికేయ విలనిజం వెరసి సినిమాని హిట్ చేశాయి. కోలీవుడ్‌లో ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిందీ సినిమా. ఈ చిత్రంతో కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
మరోవైపు యావత్ తెలుగు ప్రజలందరి మన్ననలను పొందిన పాటల షో స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్. ఎక్కడ విన్నా ఆ కంటెస్టెంట్స్ పేర్లే. అలాంటి షో ఈ ఆదివారం నాడు ఎలిమినేషన్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయనుంది. ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న ఈ పార్టిసిపెంట్స్ లో ఎవరు ఉంటారు? ఎవరు వెనుతిరుగుతారు తెల్సుకోవాలంటే ఎపిసోడ్ తప్పక చూడాలి. అంతే కాకుండా, రచయత కాసర్ల శ్యామ్ గారు ప్రతేక్య అథితిగా విచ్చేసి ఎపిసోడ్ కళను ఇంకా పెంచారు. మరి ఇలాంటి ఎపిసోడ్ ని ఏప్రిల్ 24 న అందరు తప్పక మిస్ అవ్వకుండా చూడండి.