ప్రభాస్ కు విలన్ గా నటించేందుకు నేను సిద్ధం.. కానీ, గోపీచంద్ కామెంట్స్ వైరల్

By Asianet News  |  First Published May 4, 2023, 11:43 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) నటించిన ‘రామబాణం’ రేపు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా  ఇంటర్వ్యూల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.  తాజాగా ప్రభాస్ కు మళ్లీ విలన్ గా నటించే అంశంపై స్పందించారు.  
 


టాలీవుడ్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ‘పక్కా కమర్షియల్’తో చివరిగా అలరించారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీవాస్ (Sriwass) డైరెక్షన్ లో నటించిన చిత్రం ‘రామబాణం’. డింపుల్‌ హయతి (Dimple Hayathi) హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ట నిర్మాతలుగా సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. 

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు.  తాజాగా జగపతి బాబు, గోపీచంద్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. నవదీప్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా గోపీచంద్ కు ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం వస్తే.. అన్న ప్రశ్న ఎదురైంది.  ఇందుకు గోపీచంద్ ఇలా స్పందించారు. 

Latest Videos

‘గతంలో నేను ప్రభాస్ కు విలన్ గా నటించాను. అవకాశం వస్తే తప్పకుండా ప్రస్తుతం కూడా చేస్తాను. కాకపోతే.. జయం, నిజం, వర్షం వంటి చిత్రాల్లో విలనిజం ఏ స్థాయిలో ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ను చేయడానికి ఇష్టపడుతాను. నా క్యారెక్టర్ బలంగా ఉండి.. కథను ఎలివేట్ చేసే విలన్ రోల్స్ లో నటించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రభాస్, గోపీచంద్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది తెలిసిన విషయమే. ఇక తెరపై మాత్రం ‘వర్షం’లో బద్ధ శత్రువులుగా కనిపించారు. మళ్లీ ఆ మూమెంట్ వస్తుందా అన్నది గోపీచంద్ కామెంట్స్ తో ఆసక్తిని  కలిగిస్తోంది.

ఇక చిత్రంలో తన క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గాను, కొత్తదనంగా ఉంటుందని చెప్పారు. రాముడిలాంటి అన్నయ్యకు భక్తుడి లాంటి తమ్ముడి క్యారెక్టర్ లా ఉంటుందని తెలిపారు. అందరికీ నచ్చేలా తగిన  జాగ్రత్తలు కూడా తీసుకున్నామన్నారు. హైప్ క్రియేట్ చేసిన 'రామబాణం' ఎట్టకేలకు మే 5, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 

click me!