కొన్నేండ్ల కింద తన భార్యతో విడిపోయిన.. ప్రముఖ నటుడు సంపత్ రాజ్ (Sampath Raj) తాజాగా డివోర్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా తన కూతురు గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు సంపత్ రాజ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. 20 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించారు. తమిళం, తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా సంపత్ రాజ్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’తో స్టార్ నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. విభిన్న పాత్రలతో అలరిస్తున్నారు.
అయితే, సంపత్ రాజ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న ఆయన కూతురు పుట్టిన నాలుగేండ్లకే డివోర్స్ కూడా ఇచ్చారంట.
ఈ విషయంపై తాజాగా సంపత్ రాజ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన డివోర్స్ కు కారణంగా కూడా చెప్పుకొచ్చారు. కూతురు గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. మా అమ్మకు నచ్చలేదు. నాన్న మాత్రం బాగానే సపోర్ట్ చేశాడు. నేనే సక్సెస్ అందుకున్నాక అమ్మ సంతోషించింది. కానీ నాన్న మాత్రం చూడలేకపోయారు. ఆ బాధ ఇప్పటికీ ఉంది. నాకు 23 ఏండ్లలోనే పెళ్లి అయ్యింది. ఓ పాప పుట్టింది. మా అమ్మాయికి నాలుగేండ్లు వచ్చాక మేం విడిపోయాం. డివోర్స్ తీసుకునేందుకు మేమేం పెద్దగా గొడవలు పడలేదు. కూల్ గా కూర్చొని మాట్లాడుకున్నాం. చిన్న వయస్సులో పెళ్లి కావడం వల్లే ఇలా జరిగి ఉండోచ్చు. అయితే పాప బాధ్యత నేనే తీసుకున్నా. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఉంది. ఉద్యోగం చేస్తోంది.’ అని చెప్పుకొచ్చారు.
సంపత్ రాజ్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో 1986లో జన్మించారు. ఆయన పూర్తి పేరు సంపత్ కుమార్. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో వరుసగా నటిస్తున్న.. ఎక్కువ శాతం తమిళ సినిమాల్లోనే నటించారు. ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళం, కన్నడలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. చివరిగా మాస్ రాజా రవితేజ ‘రావణసుర’, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’తో అలరించారు.