హీరోలు ఇక ఆ మాటలు చెప్పకండి.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : Aug 16, 2019, 03:10 PM IST
హీరోలు ఇక ఆ మాటలు చెప్పకండి.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

సారాంశం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అడివి శేష్ పంజా, బాహుబలి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత క్షణం చిత్రంతో హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అడివి శేష్ విభిన్నమైన సస్పెన్స్ నేపథ్యంలో కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది అడివి శేష్ గూఢచారి చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

తాజాగా అడివి శేష్ నటించిన 'ఎవరు' చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రెజీనా ఫిమేల్ లీడ్ గా మంచి నటన కనబరిచింది. చిత్రం సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఎవరు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి దిల్ రాజు అతిథిగా హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు, నటులు తమకు బ్యాగ్రౌండ్ లేదని అందువల్లే రాణించలేకపోతున్నామని కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరూ అడివి శేష్ ని చూసి నేర్చుకోవాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడని దిల్ రాజు అన్నారు. 

ఎవరు చిత్రాన్ని తాను చూశానని.. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా చిత్రం ఉందని దిల్ రాజు అన్నారు. మామూలు కథలకు నేను జడ్జిమెంట్ ఇవ్వగలను.. కానీ ఇలాంటి ట్విస్ట్స్ ఉండే కథలని తాను జడ్జ్ చేయలేనని దిల్ రాజు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే తనని సంప్రదించాలని.. తప్పకుండా కలసి చేద్దామని దిల్ రాజు అడివి శేష్ కు మాట ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్