ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా కొన్ని చోట్ల ఓకే అనిపించుకునే కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో వారానికి పూర్తి డ్రాప్ అయ్యింది.
భీమా సినిమా గోపిచంద్ కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అని అభిమానులు అంటున్నారు కలెక్షన్స్ లో ఆ జోరు కనిపించటం లేదు. చాలా రోజుల తర్వాత గోపిచంద్ కు హిట్ పడిందని, భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, నటన పరంగా దాదాపుగా క్యారక్టర్ లో జీవించాడని ప్రశంసలు కురిపివారు సినిమాకు వెళ్లటం లేదు .అలాగే సినిమా కథ అటూ ఇటూగా ఉన్నా ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపధ్యంలో ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా కొన్ని చోట్ల ఓకే అనిపించుకునే కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో వారానికి పూర్తి డ్రాప్ అయ్యింది. పది రోజుల్లో ఎంత వచ్చింది..ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందోచూద్దాం.
10 రోజుల లెక్కలు
తెలంగాణా - 02.82cr
( బ్రేక్ ఈవెన్ - 03.50cr)
రాయలసీమ - 01.18cr
( బ్రేక్ ఈవెన్ - 01.50cr )
కోస్తాధ్ర +ఉత్తరాంధ్ర- 03.21cr
( బ్రేక్ ఈవెన్ - 04.50cr )
రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులు
మొత్తం థియేటర్ గ్రాస్ - 12.40cr
రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులు
మొత్తం థియేటర్ షేర్ - 07.21cr
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా + ఓవర్ సీస్ - 00.70cr
( బ్రేక్ ఈవెన్ - 01.80cr )
వరల్డ్ వైడ్ 10 రోజులు
మొత్తం థియేటర్ గ్రాస్ - 14.30cr
వరల్డ్ వైడ్ 10 రోజులు
మొత్తం థియేటర్ షేర్ - 07.91cr
ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ షేర్ బ్రేక్ ఈవెన్ - 12.00cr
ట్రేడ్ నుంచి అందుతున్న ఈ లెక్కల ప్రకారం ‘భీమా’ (Bhimaa) చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇప్పుడున్న టాక్ తో అయితే కొద్దిగా కష్టమే. ఏమన్నా ఈ రెండు రోజుల్లో పికప్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే తప్ప టార్గెట్ అందుకోవడం కష్టం.
ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, (Priya Bhavani Shankar) ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు.