రిలీజ్ డేట్ ప్రకటన..గోపిచంద్ ని టెన్షన్ లో పడేసిందిట

By Surya Prakash  |  First Published Oct 3, 2021, 6:54 AM IST

నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన సినిమా విడుదలకు పెట్టారు. ఈ నేపధ్యంలో ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది. హిట్ లో ఉన్న తనకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనే టెన్షన్ గోపిచంద్ కు పట్టుకుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  


సాధారణంగా తమ సినిమా రిలీజ్ అవుతోదంటే హీరోలకు ఉండే ఆనందం ఓ రేంజిలో ఉంటుంది.  అయితే రాంగ్ టైమ్ లో రిలీజ్ అయితే మాత్రం టెన్షనే పట్టుకుంటుంది. రీసెంట్ గా  మాచో స్టార్ గోపీచంద్,   స్పోర్ట్స్ డ్రామా సీటిమార్  తో వచ్చి సూపర్ హిట్  కొట్టారు.   సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా గోపిచంద్ కు మళ్లీ కెరీర్ ని ఇచ్చిందనే చెప్పాలి. వరస ఫ్లాఫ్ లతో ఆగిపోయినట్లు ఉన్న అతని కెరీర్ కి కదలిక వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని కొనసాగించే సినిమా రిలీజ్ అయితే బాగుండును అని భావిస్తున్నాడు. కానీ నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సిన సినిమా విడుదలకు పెట్టారు. ఈ నేపధ్యంలో ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది. హిట్ లో ఉన్న తనకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనే టెన్షన్ గోపిచంద్ కు పట్టుకుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  

' సీటీమార్’ సక్సెస్‌తో ఎపుడో థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఈ సినిమాను ఒకప్పుడు తెలుగులో ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్  డైరెక్ట్ చేసారు. అయితే అంత క్రేజీ కాంబినేషన్ కూడా రిలీజ్ ఆగిపోయింది. ఆ మధ్యన సిని పెద్దలు పూనుకుని ఈ సినిమా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు.

Latest Videos

undefined

అయితే తాజాగా గోపీచంద్, నయనతార నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగినపోవడంతో విడుదలకు రెడీ అయ్యింది. 2015లో రిలీజ్ దగ్గరకు వచ్చి లాస్ట్ మినిట్ లో అనేక కారణాల చేత రిలీజ్ ఆగిపోయిన ఆరడుగుల బుల్లెట్ ఈ నెల 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు. మణిశర్మ సంగీతం అందించారు ఈ సినిమాను తాండ్ర రమేష్ నిర్మించగా.. బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా పై గోపిచంద్ టెన్షన్ ఎలా ఉన్నా, దర్శక,నిర్మాతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న నిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.
 

click me!