రామ్ చేత ఒకే అనిపించుకున్న శ్రీను వైట్ల...? ఇస్మార్ట్ హీరో రిస్క్ చేస్తున్నాడా..?

Published : Jul 19, 2022, 01:41 PM IST
రామ్ చేత ఒకే అనిపించుకున్న శ్రీను వైట్ల...? ఇస్మార్ట్ హీరో రిస్క్ చేస్తున్నాడా..?

సారాంశం

ఇస్మార్ట్ హీరో రామ్ పోతీనేని రిస్క్ ల మీది రిస్క్ లు చేస్తున్నాడు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ.. కెరీర్ లో ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్నాడు. ప్రస్తుతం మరో ప్రయోగానికి రామ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

రామ్ పోతినేని నుంచి వరుసగా ప్లాప్ సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా రామ్ నుంచి వచ్చిన ది వారియర్ మూవీ కూడా డిజాస్టర్ దిశగా వెళ్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈసినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. గతంలో వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయట పడి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ సాధించాడు రామ్. ఆ తరువాత కూడా మాస్ సినిమాలపైనే దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే రెడ్ సినిమా చేశాడు. కాని ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

ప్రస్తుతం రిలీజ్ అయిన ది వారియర్ కూడా డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోవడంతో  షాక్ లో ఉ న్నాడు రామ్.  అయితే డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నా.. రామ్ మాత్రం మాస్ ఇమేజ్ కే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సెలక్ట్ చేసుకునే సినిమాలు కూడా అలానే ఉన్నాయి. వారియర్ సినిమా సంగతి తేలిపోయింది. ఇక నెక్ట్స్ రామ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తి కరంగా మారింది. రామ్ బోయపాటి శ్రీను తో మూవీ చేయబోతున్నాడు. అయితే బోయపాటి సంగతి తెలిసిందే.. హీరో ఎంత చిన్నవాడైనా అతనిలో మాస్ యాంగిల్ ను లాగి చూపిస్తాడు. మరి రామ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.  

అయితే  ది వారియర్ ఫెయిల్యూర్ తో మరో సారి ఆలోచనలో పడ్డాడట రామ్.  మాస్ ఇమేజ్ కు స్టిక్ అయి ఉండి.. మధ్యలో కాస్త రూట్ మార్చాలి అనుకుంటున్నాడట. అందుకే తనకు రెఢీ సినిమాతో కెరీర్ టర్న్ అయ్యే హిట్ సినిమా ఇచ్చిన శ్రీను వైట్లకు సినిమా కన్ ఫార్మ్ చేశాడని టాక్. అయితే  .. ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్స్ జాబితాలో ముందు వరుసలో కనిపించాడు. ఆ తరువాత కాలంలో వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తూ.. ఫెయిడ్ అవుట్ అయ్యాడు శ్రీను

ఇక రీసెంట్ గా... మంచు విష్ణుతో  ఢీ సీక్వెల్ చేయనున్నట్టు కొంతకాలం క్రితం అనౌన్స్ చేశారు. .. టైటిల్ పోస్టర్ ను కూడా వదిలారు. కానీ ఆ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. కానీ రామ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు అనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. గతంలో రామ్ కి రెడీ సినిమాతో శ్రీను వైట్ల భారీ హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చోరవతోనే రామ్ కి శ్రీను వైట్ల ఒక కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిందని టాక్. అయితే అసలే  వరుస దెబ్బలు తింటున్న రామ్ మరోసారి రిస్క్ చేయడం అవసరమా అని అంటున్నారు సినిమా జనాలు. 

రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ది వారియర్ థియేటర్స్ లోనే ఉంది. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వలన ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత శ్రీను వైట్ల సినిమా చేయవచ్చనేది  ఫిల్మ్ సర్కిల్ నుంచి వినిపిస్తున్న మాట. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా