గాడ్ ఫాదర్ బోరింగ్ అన్న అనుదీప్..!

Published : Nov 04, 2022, 01:20 PM ISTUpdated : Nov 04, 2022, 02:27 PM IST
గాడ్ ఫాదర్ బోరింగ్ అన్న అనుదీప్..!

సారాంశం

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ గాడ్ ఫాదర్ నచ్చలేదని చెప్పారు. చిరంజీవి సినిమా గురించి ఇంత ఓపెన్ గా బహుశా ఎవరూ మాట్లాడి ఉండరు. ఒక అప్ కమింగ్ డైరెక్టర్ అనుదీప్ ఇంత పెద్ద రిస్క్ చేయడం అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. ఐతే అసలు నిజం తెలిశాక చల్లబడ్డారు.   

గాడ్ ఫాదర్ మూవీ నచ్చలేదని అనుదీప్ చెప్పడం సంచలనం రేపింది. మెగాస్టార్ చిరంజీవి మూవీ గురించి ఆయన ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇచ్చారని అందరూ వాపోయారు. చివర్లో నేను చెప్పింది ఇప్పటి గాడ్ ఫాదర్ గురించి కాదు, హాలీవుడ్ మూవీ అయిన అప్పటి గాడ్ ఫాదర్ అని క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

 ప్రతి ఒక్కరూ గాడ్ ఫాదర్ చూశావా? అని అడుగుతుంటే వాళ్ళ కోసం సినిమా చూశాను. నాకు సినిమా బోర్ కొట్టింది అన్నారు. చివరికి ఆ షో యాంకర్ కూడా అనుదీప్ స్టేట్మెంట్ కి భయపడ్డారు అనుదీప్ మాత్రం తగ్గకుండా నాకే కాదు చాలా మందికి గాడ్ ఫాదర్ నచ్చలేదని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. మరలా యాంకర్ మీరు ఏ గాడ్ ఫాదర్ గురించి చెబుతున్నారని క్లారిటీ అడిగారు. నేను చెబుతుంది హాలీవుడ్ గాడ్ ఫాదర్ అన్నారు. ప్రతి విషయాన్నీ సర్కాస్టిక్జ్ గా మాట్లాడే అనుదీప్ చిరంజీవి సినిమా గురించి మాట్లాడి చివర్లో ఏమైనా మాట మార్చాడా అనే అనుమానం కలుగుతుంది. 

చివర్లో అనుదీప్ చెప్పిన హాలీవుడ్ గాడ్ ఫాదర్ అన్న మాట కట్ చేసిన వీడియో యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీంతో నిజంగా అనుదీప్ చిరంజీవి గాడ్ ఫాదర్ గురించి నెగిటివ్ కామెంట్ చేశారని కొందరు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వందల కాల్స్ అనుదీప్ ఫేస్ చేసి ఉంటాడు. చిరంజీవి కంటే ఎక్కువ బాధపడే వర్గం అనుదీప్ ని బెదిరించి ఉంటారు. కొందరు సున్నితంగా చెప్పి ఉంటారు. ఇక నీ కెరీర్ ఢమాల్ అని భయపెట్టి ఉంటారు. అనుదీప్ అనుకోకుండా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మామ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో
Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?