
చాలా కాలం నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రాజమౌళితో సినిమా ఎప్పుడా అని. ఈ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా అంది కూడా భారీ బడ్జెట్ తో.. ప్రపంచ స్థాయిలో.. అని తెలిసి దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక త్వరగా సినిమాస్టార్ట్ అయితే బాగుండు అనుకుంటున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అవి అప్ డేట్ అవుతున్నాయి. కథ విషయంలో, మహేష్ లుక్ విషయంలో.. యాక్షన్ మూవీ అని.. హాలీవుడ్ రేంజ్ అని... మహేష్ ను హాలీవుడ్ హీరోను చేయబోతున్నాడని..ఇలా రకరకాల మాటలు వినిపించాయి. దాంతో మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఎదురుచూపులు పెరిగాయి.. ఇప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అద్భుత విజయంతో.. సూపర్ ఫామ్ లో ఉన్నాడు రాజమౌళి. అదే ఉత్సాహంతో మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సబంధించి ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి సినిమా ఎలా ఉంటుందా అని ఇండియన్ ఆడియన్స్ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మహేష్‌బాబు ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రాజమౌళి సినిమా చేయబోతున్నారు.
యూనివర్సల్ కథ, హాలీవుడ్ స్థాయి హంగులతో రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ తో సినిమా అయిపోగానే రాజమౌళితో మహేష్ సెట్స్ మీదకు వెల్లబోతున్నాడని అనుకున్నారు అంతా. కాని తాజా బజ్ ప్రకారం ఈ మూవీ ఇంకాస్త లేట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లు తెలిసింది. 2024లో ఈ మూవీ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి హంగులతో నిర్మించనున్న ఈ సినిమా కోసం ఫేమస్ హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారని చెబుతున్నారు. బిజినెస్‌పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టూడియోలతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. అయితే అటు హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ డేట్స్ ను సెట్ చేయడంలో జక్కన్న బిజీగా ఉన్నాడట.
అందుకే ఈమూవీని హడావిడిగా స్టార్ట్ చేయకుండా.. అన్నీసరిచూసుకుని మొదలట్టాలని చూస్తున్నాడట రాజమౌళి. అంతే కాదు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన జక్కన్న.. దీని కోసం దాదాపు ఏడాది సమయం తీసుకోనున్నాడని సమాచారం. దాంతో ఫైనల్ గా రాజమౌళితో మహేష్‌బాబు సినిమా ఇక 2024లోనే సెట్స్‌మీదకు వెళ్తుందని సమాచారం. ఇక ఈ విషయంలో సూపర్ స్టార్ అభిమానులు నిరాశతోనే ఉన్నట్టు తెలుస్తోంది.