మళ్ళీ దొరికిపోయిన థమన్.. గాడ్ ఫాదర్ ట్యూన్ అక్కడి నుండి లేపేశాడా!

By Sambi ReddyFirst Published Sep 14, 2022, 1:18 PM IST
Highlights

తక్కర్ మార్ సాంగ్ ట్యూన్ విన్న నెటిజెన్స్ ఇది కాపీ అంటున్నారు. క్రాక్ సినిమాలో ఓ పాటకు థమన్ ఇచ్చిన ట్యూన్ మరలా గాడ్ ఫాదర్ కోసం వాడేశారు అంటున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై కాపీ ఆరోపణలకు కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు ఈ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ సింగిల్ విషయంలో అతడు దొరికిపోయాడు. కొందరు నెటిజెన్స్ గతంలో ఆయన కంపోజ్ చేసిన పాటలోని ట్యూన్ ని గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ కలిగి ఉందంటున్నారు. చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కింది. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ రూపొందించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. గాడ్ ఫాదర్ టీజర్ విడుదల చేయగా విశేష స్పందన దక్కింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ''తార్ మార్ తక్కర్ మార్'' ప్రోమో విడుదల చేశారు. ఈ సాంగ్ లో సూపర్ స్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. పూర్తి సాంగ్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఇక తక్కర్ మార్ సాంగ్ ట్యూన్ విన్న నెటిజెన్స్ ఇది కాపీ అంటున్నారు. క్రాక్ సినిమాలో ఓ పాటకు థమన్ ఇచ్చిన ట్యూన్ మరలా గాడ్ ఫాదర్ కోసం వాడేశారు అంటున్నారు. 

Emma pic.twitter.com/4zoOQQabn5

— Colepithre (@pithre07)

ఇదిగో ప్రూఫ్ అంటూ రెండు ట్యూన్స్ పోల్చుతూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. క్రాక్, గాడ్ ఫాదర్ చిత్రాలకు థమన్ ఇచ్చిన ఈ ట్యూన్ కొంచెం దగ్గరగా ఉంది. థమన్ ని ట్యాగ్ చేస్తూ నెటిజెన్స్ ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై థమన్ ఎలా స్పందిస్తారో చూడాలి. గత రెండేళ్లుగా దేవీశ్రీని తొక్కేసి థమన్ అనూహ్యంగా రేసులో దూసుకొచ్చాడు. అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ థమన్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం స్టార్స్ అందరూ ఆయన వెనకే పడుతున్నారు. 

మరి బిజీగా ఉన్న థమన్ కలగం పులగం చేసి అన్ని చిత్రాలకు ఒకే రకమైన ట్యూన్స్ ఇస్తున్నారనిపిస్తుంది. చిత్రీకరణ దశలో ఉన్న బాలయ్య 107, మహేష్ 28 చిత్రాలలో పాటు పలు చిత్రాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సాంగ్స్ కూడా థమన్ కంపోజ్ చేయగా ఆదరణ దక్కించుకున్నాయి. 

click me!