బాడీగార్డ్ చేత చెంపదెబ్బ తిన్నబాలీవుడ్ స్టార్ హీరో.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన రణ్ వీర్ సింగ్

By Mahesh JujjuriFirst Published Sep 14, 2022, 11:34 AM IST
Highlights

అతను బాలీవుడ్ స్టార్ హీరో.. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరో.. స్టార్ హీరోయిన్ కు భర్త. సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న రణ్ వీర్ సింగ్..  బాడీగార్డ్ చేత చెంపదెబ్బ తినాల్సి వచ్చింది. ఈ విషయం ప్రస్తుం సంచలనంగా మారింది. ఇంతకీ ఏమైయ్యింది...?
 

ఈ వీక్ లో సైమా అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. సైమా 2022 వేడుకలకు బెంగళూరు వేదికయ్యింది. సినీ తారల తళకు బెళుకులతో వేదిక మెరిసిపోయింది.. మురిసిపోయింది.  సౌత్, నార్త్ స్టార్స్ కలయికతో కార్యక్రమం సందడిగా మారింది. అంతే కాదు ఈ వేడుకల్లో పుష్ప సినిమా ఏకంగా ఆరు అవార్డ్ లు సాధించి హైలెట్ గా నలిచింది. దాంతో ఈ వేడుకల్లో మన టాలీవుడ్ హైలెట్ గా నిలిచంది. ఇక ఈ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అంతట చర్చనీయాంశం అయ్యింది. 

సైమా వేడుకలకు వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కు అవమానం జరిగింది. ఆయన ఏకంగా చెంపదెబ్బతినాల్సి వచ్చింది. వేడకుల్లో రెడ్ కార్పెట్ మీద నడుస్తున్న రణ్ వీర్ సింగ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకోవాలి అని తెగ ఆరాటపడ్డారు. అంత మంది మీదకి వచ్చినా.. కోపగించుకోకుండా ఒక్కొక్కరికి ఓపిగ్గా  సెల్పీలు ఇచ్చాడు రణ్ వీర్ సింగ్. ఈ క్రమంలో జనాలు ఎక్కువ కావడంతో.. సెక్క్యూరిటీ గార్డ్స్ కంట్రోల్ చేయలేక పోయారు. 

 

Oops! Who slapped him? pic.twitter.com/0jzekvpOMr

— Payal Mohindra (@payal_mohindra)

 

రణ్ వీర్ సింగ్ ను ప్రొటెక్ట్ చేయాలన్న హడావిడిలో బాడీగార్డ్ ఒకరు ప్రయత్నిస్తున్న టైమ్ లో.. అతి చెయి.. రణ్ వీర్ సింగ్ చెంపకు గట్టిగా తాకింది. దాంతో అతను ఒక్క సారిగా షాక్ కు గురయ్యాడు. చెంపపై చేయి పెట్టుకుని చాలా సేపు షాక్ లో ఉండిపోయాడు. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోకు ఇలా జరగడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సోషళ్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. 

click me!