పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది.. అందరు జాగ్రత్తః గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా రిక్వెస్ట్

Published : Apr 21, 2021, 08:15 PM ISTUpdated : Apr 21, 2021, 08:19 PM IST
పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది.. అందరు జాగ్రత్తః గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా రిక్వెస్ట్

సారాంశం

వైరస్‌ సునామీలా దూసుకొస్తుంది. ప్రధాని మోడీ కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. తాజాగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఆవేదన చెందుతుంది. ట్విట్టర్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. గతేడాది కంటే ఈ సారి సెకండ్‌ వేవ్‌లో భాగంగా కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజుకు మూడు లక్షల వరకు కొత్త కేసులు నమోదవుతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైరస్‌ సునామీలా దూసుకొస్తుంది. ప్రధాని మోడీ కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. తాజాగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఆవేదన చెందుతుంది. ట్విట్టర్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 

`కరోనా విజృంభన ఎంత భయంకరంగా ఉందో చూస్తూనే ఉన్నాం. భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైద్య రంగం నుంచి కూడా పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం, ఫ్రంట్‌లైన్‌ వారియర్ల కోసం మీరంతా ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే బయటకు రండి. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్కులు ధరించండి. ప్లీజ్‌ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోండి. మనం తీసుకునే జాగ్రత్తలే వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయి` అని తెలిపింది ప్రియాంక. 

బాలీవుడ్‌ నటిగా రాణించి హాలీవుడ్‌ ఆఫర్స్ దక్కించుకుని గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ నిక్‌ జోనాస్‌ని వివాహం చేసుకుని అక్కడే సెటిల్‌ అయ్యింది. ప్రస్తుతం `సిటాడెల్‌` అనే అమెజాన్‌ సిరీస్‌తో పాటు `మ్యాట్రిక్స్‌ 4`లోనూ నటిస్తోంది. హీరోయిన్‌గానూ పలు సినిమాలతో బిజీగా ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?