ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ కోసమే కృతి సనన్‌ ఆ పుస్తకం చదువుతోందట!

Surya Prakash   | Asianet News
Published : Apr 21, 2021, 04:53 PM IST
ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ కోసమే కృతి సనన్‌ ఆ పుస్తకం చదువుతోందట!

సారాంశం

 ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాటానికి సీతకు సంభందించిన పుస్తకాలు చదువుతోంది. రీసెంట్ గా ‘సీతాయణం’ పుస్తకం పట్టుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా  ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నారు. అలాగే ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్‌ను ఫైనలైజ్‌ చేసి షూట్ చేస్తున్నారు. ఈ సమయంలో సీతగా  కృతి సనన్‌ సెట్ అవుతుందా అనే డౌట్స్ చాలా మంది సోషల్ మీడియా వేదికగా వెల్లబుచ్చారు. కొందరు ట్రోల్ చేసారు. 

అయితే ఆమె ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాటానికి సీతకు సంభందించిన పుస్తకాలు చదువుతోంది. రీసెంట్ గా ‘సీతాయణం’ పుస్తకం పట్టుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆమె తాజాగా వరుణ్ ధావన్ తో చేస్తున్న సినిమా నిమిత్రం అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. ‘సీతాయణం’ పుస్తకం రామాణాన్ని సీతాదేవి పాయింటాఫ్ వ్యూలో చెప్పబడ్డ పుస్తకం. ఈ విషయాన్ని ఆదిపురుష్ టీమ్ ఇనిస్ట్రాలో షేర్ చేసింది. పాత్రకు ప్రాణం పోయటం కోసం ఆమె పడుతున్న తాపత్రయాన్ని చెప్పకనే చెప్పారు. 
  
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక ఆదిపురుష్‌లో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి హేమ మాలిని నటించనుంది.  టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్,  ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  3డి గ్రాఫిక్స్‌లో ఒక విజువల్ వండర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని  రిలీజ్ చేయనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?