అన్న కాదన్నాడు.. తమ్ముడు ఓకే చేశాడు.. `ఉప్పెన` హీరో జోరు మామూలుగా లేదుగా!

By Surya Prakash  |  First Published Mar 29, 2021, 3:17 PM IST


 తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. ‘ఉప్పెన’ తర్వాత పలువురు దర్శక-నిర్మాతల చూపు ఆయనపై పడింది. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 


 తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. ‘ఉప్పెన’ తర్వాత పలువురు దర్శక-నిర్మాతల చూపు ఆయనపై పడింది. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ సినిమా చేయనున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. వచ్చే నెల ఆరంభంలోనే ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందులో వైష్ణవ్‌కి జోడీగా కేతిక శర్మ నటించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో సినిమా ప్రారంభం కానుంది. 

నిజానికి ఇది సాయితేజ్ చేయాల్సిన ప్రాజెక్టు. అయితే తనకుతానుగా సాయితేజ్ వదులుకున్న సినిమా. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా గిరీశయ్య దర్శకత్వంలో సాయితేజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు చేతులు మారింది. నిర్మాత, దర్శకుడు సేమ్. హీరో మాత్రం మారిపోయాడు. సాయితేజ్ స్థానంలో వైష్ణవ్ తేజ్ వచ్చి చేరాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సాయితేజ్, లెక్క ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత అదే బ్యానర్ పై గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమా చేయాలి. కానీ ఆ సబ్జెక్ట్ తనకంటే తమ్ముడికి బాగుంటుందని భావించి, తనే రిఫర్ చేశారని తెలుస్తోంది. 

Latest Videos

ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై సాయితేజ్ చేయాల్సిన ఈ  సినిమా కూడా వైష్ణవ్ తేజ్ చెంతకు చేరింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను తెలియబోతున్నాయి.

ఇక వైష్ణవ్ తేజ్ నెక్ట్స్ రిలీజ్ అయ్యే సినిమా విషయానికి వస్తే... ప్రముఖ దర్శకుడు క్రిష్‌, కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘జంగిల్‌బుక్’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్‌ ఓ సందర్భంలో తెలిపారు. వైష్ణవ్ ‌తేజ్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌  హీరోగా రానున్న చిత్రమిదే.

click me!