సాయిపల్లవితో నాకుమారుడికి ఎలాంటి ఎఫైర్ లేదు

Published : Mar 10, 2018, 03:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
సాయిపల్లవితో నాకుమారుడికి ఎలాంటి ఎఫైర్ లేదు

సారాంశం

ఎక్కడ నుంచి పుట్టుకోస్తాయో తెలీదు గానీ.. సినీ పరిశ్రమలో గాసిప్స్‌కు కొదవేమీ ఉండదు ఫిదాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన సాయి పల్లవికి ఈ చేదు వార్త ఎదురైంది​ ఓ మంత్రి కుమారుడు నటి సాయిపల్లవిని ప్రేమించారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్

ఎక్కడ నుంచి పుట్టుకోస్తాయో తెలీదు గానీ.. సినీ పరిశ్రమలో గాసిప్స్‌కు కొదవేమీ ఉండదు క్షణాల్లోనే ప్రపంచమంతా పాకిపోతుంటాయి. ఇలాంటి రూమర్ల బారిన ఎంతో మంది సినీ ప్రముఖులు పడ్డారు. తాజాగా ఫిదాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన సాయి పల్లవికి ఈ చేదు వార్త ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మంత్రి కుమారుడు నటి సాయిపల్లవిని ప్రేమించారనే వార్త సోషల్ మీడియాలో . ఫిదా, ఎంసీఏ చిత్రాల తర్వాత సాయిపల్లవి నటించిన కణం సినిమాలో టాలీవుడ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఆ చిత్ర ప్రమోషన్‌లో సాయిపల్లవి విస్తృతంగా పాల్గొన్నారు. కానీ మంత్రి కుమారుడితో ప్రేమ, పెళ్లి వివాదంపై ఆమె ఎక్కడా స్పందించలేదు. దాంతో ఎవరా మంత్రి కుమారుడు అనే చర్చ మీడియాలో విస్తృతంగానే జరిగింది.

 

సాయిపల్లవి, మంత్రి కుమారుడి అఫైర్ వార్తలు తగ్గుముఖం పట్టకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన కుమారుడు గంటా రవితేజపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారుడు రవితేజ, సాయిపల్లవి మధ్య ఎలాంటి అఫైర్ లేదు. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించను. కానీ రూమర్ల స్థాయి పెరిగిపోవడంతో స్పందించాల్సి వచ్చింది. అవాస్తవమైన, నిరాధారమైన వార్తలతో ఎవరిపైనైనా దుష్ప్రచారం చేయవద్దు అని మంత్రి గంటా కోరారు.అయితే సాయిపల్లవితో మంత్రి కుమారుడు పీకల్లోతు ప్రేమలో పడ్డారు. తన తల్లిదండ్రులకు మంత్రి కుమారుడు తన అఫైర్ గురించి చెప్పి ఒప్పించారు. ఆ నేపథ్యంలో సాయిపల్లవి కుటుంబంతో మంత్రి కుటుంబం మాట్లాడారు. అయితే మంత్రి ప్రపోజల్‌ను సాయిపల్లవి కుటుంబ సభ్యులు తిరస్కరించారు అనే ఓ నిరాధారమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడతున్నది.

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌