MAA Elections: శివ బాలాజీ చేయి కొరికేసిన హేమ..

pratap reddy   | Asianet News
Published : Oct 10, 2021, 12:24 PM IST
MAA Elections: శివ బాలాజీ చేయి కొరికేసిన హేమ..

సారాంశం

'మా' ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య రసాభాస జరుగుతోంది.

'మా' ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య రసాభాస జరుగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు అంటూ విష్ణు ప్యానల్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మంచు విష్ణు, మోహన్ బాబు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. 

పోలింగ్ కేంద్రం వద్ద లేని సభ్యుల ఐడిలతో ఓట్లు వేస్తున్నారు అంటూ మంచు విష్ణు ప్యానల్ Prakash Raj ప్యానల్ పై ఆరోపణలు చేస్తున్నారు. దీనితో సభ్యుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు పరిస్థితి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఒక ఊహించని సంఘటన అందరిని షాక్ కి గురిచేస్తోంది. సభ్యుల మధ్య గొడవ జరిగినప్పుడు హేమ.. శివబాలాజీ చేయి కొరికేసిందట. దీనితో నరేష్ శివ బాలాజీని మీడియా ముందుకు తీసుకువచ్చి అతడి చేయి చూపించారు. నో బైటింగ్ ఓన్లీ ఓటింగ్ అంటూ నరేష్ వెళ్లిపోయారు. 

Also Read: MAA Elections: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్, నిత్యామీనన్, రాంచరణ్.. పోలింగ్ కేంద్రం వద్ద తారలు

ఇక నటుడు సుమన్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోపల పెద్ద కురుక్షేత్రమే జరుగుతోందని సుమన్ అన్నారు. అంతా కుర్ర వాళ్లే కదా..ఇదంతా సహజం. ఈరోజు రేపు ఈ వేడి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత అంతా మామూలు అయిపోతుంది అని సుమన్ అన్నారు. 

12 గంటల వరకు మా ఎన్నికల్లో 383 ఓట్లు పోల్ అయ్యాయి. ఇంకా పోలింగ్ కి రెండు గంటల సమయం ఉంది. ఈ ఉదయమే టాలీవుడ్ సెలెబ్రిటీలు పవన్, చిరు, రాంచరణ్, బాలయ్య, సుమన్, సాయి కుమార్, నిత్యా మీనన్ లాంటి వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే