
అర్జున్ రెడ్డి మ్యానియాతో యూత్‌లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో అస్సలు కంప్రమైజ్ కావడం లేదు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒకదాని వెంట మరోక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా ‘గీత గోవిందం’.. గీత, గోవింద్ అనే ఇద్దరు యువతి యువకుల మధ్య జరిగిన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తికావొచ్చిన ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను ఈ మంగళవారం ఉదయం 11.50 గంటలకు విడుదల చేయనున్నట్లు విజయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.. హీరోయిన్ తో కలిసి బైక్‌పై వెళుతుండగా ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ అంటూ సాగే పాట లిరిక్‌ను పోస్ట్ చేశారు.. రష్మిక మంధన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.