
ఎపిసోడ్ ప్రారంభంలో ఆఫీస్ కి టైం అవుతుంది వెళ్ళాలి అంటాడు మురారి నీతో ఒక మాట చెప్పడానికే ఉన్నాను పెద్ద అత్తయ్య అని మీ ఆవిడ ఎదిరించి మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా అనట్లేదు ఎందుకు అని అడుగుతుంది ముకుంద. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఆలోచిస్తాను అంటాడు మురారి. వాళ్ల ముందు నువ్వు మాట పడటం నాకు ఇష్టం లేదు అంటుంది ముకుంద.
కృష్ణ నందిని కోసం ఆలోచిస్తుంది అది తప్ప అంటాడు మురారి. కృష్ణని నందిని నమ్ముతుంది తనకి ఏ కష్టం రాదని భావిస్తుంది. కృష్ణ కి కూడా నందిని అంటే ఇష్టం తనకి నందిని పసిపాప లాగా కనిపిస్తుంది ఇందులో కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటాడు మురారి. రేపు మాపో వెళ్ళిపోయే నీ భార్య ఇవన్నీ నెత్తిన వేసుకోవడం ఎందుకు అంటుంది ముకుంద.
తను ఏం చేస్తుంది ఇంటి తాళాలు గుప్పెట్లో పెట్టుకుందా, అంటూ నిలదీస్తాడు మురారి. నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండడం నాకు ఇష్టం లేదు అంటుంది ముకుంద. నా వాళ్ళు నన్ను అంటే నాకు లేని బాధ నీకెందుకు అంటాడు మురారి. నీ ఇష్టం చెప్పాల్సింది చెప్పాను మీరు అందరూ వేరు నేను వేరు అన్నట్లుగా మాట్లాడుతున్నావు.
వెళ్ళు వీలైతే వచ్చేటప్పుడు నీ భార్యని పిక్ చేసుకొని దారిలో పానీపూరీలు అవి తినిపించి తీసుకురా అంటుంది ముకుంద. బాగా గుర్తు చేశావు సాయంత్రం ఎలాగూ బయటకు వెళ్లాలి అనుకుంటున్నాను అప్పుడు తినిపిస్తాన్లే అంటూ కారు ఎక్కి వెళ్ళిపోబోతాడు మురారి. కారు చీర డోర్ మధ్యలో ఉండిపోవటంతో గట్టిగా అరుస్తుంది ముకుంద.
కారు ఆపి డోర్ తీసేసరికి చీర బయటికి వస్తుంది. ఒక నిమిషంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది సారీ అంటాడు మురారి. నువ్వు కావాలని చేయలేదు కదా వదిలేయ్ అంటుంది ముకుంద. నీ చీర కూడా డామేజ్ అయింది. ఒక్క నిమిషం ఆలస్యమైతే ఏమైయ్యదో ఊహిస్తేనే భయం వేస్తుంది అంటాడు మురారి. భయపడకు నీ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు.
నీకు ఆఫీస్ కి టైం అవుతుంది బయలుదేరు అంటుంది ముకుంద. అతను వెళ్ళిపోయిన తర్వాత కనిపించవు కానీ నాకు ఏమైనా అయితే నువ్వు అసలు తట్టుకోలేవు అనుకుంటుంది ముకుంద. మరోవైపు గౌతమ్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వచ్చేసి గుడ్ మార్నింగ్ చెప్తుంది కృష్ణ. డోర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు గౌతమ్ ఎందుకు అని అడుగుతుంది కృష్ణ.
వెళ్ళమన్నాను కదా వెళ్ళు అనటంతో రూమ్ బయటికి వెళుతుంది. ఇప్పుడు మీ ఐ కమిన్ అని అడిగి రా అంటాడు గౌతమ్. ఆమె అలాగే చేస్తుంది లోపలికి వచ్చిన తరువాత థాంక్స్ ఇక్కడ చెప్పాలా అది కూడా బయటి నుంచే చెప్పాలా అని అడుగుతుంది. ఈ ఓవరాక్షన్ వద్దు అంటాడు గౌతమ్. నేను ఎప్పుడెప్పుడు నిన్ను నందిని గురించి అడగాలా అని వెయిట్ చేస్తున్నాను.
ఇప్పుడు నందిని గురించి ఎలా అడగాలో అర్థం కావట్లేదు అనుకుంటాడు గౌతమ్. నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది కృష్ణ. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటాడు కృష్ణ. మా నందిని అని కృష్ణ అంటుండగానే తనకి ఎలా ఉంది అంటూ కంగారుగా అడుగుతాడు గౌతమ్. ఒకసారి గా షాక్ అవుతుంది కృష్ణ. టాబ్లెట్లు మార్చావు కదా ఎలా ఉంది అంటాడు గౌతమ్.
మా భవాని అత్తయ్య ఆ టాబ్లెట్స్ వెయ్యొద్దు అంటున్నారు అంటుంది కృష్ణ. పిచ్చి పట్టి హాస్పిటల్ పాలు చేయాలని ఆవిడ ఉద్దేశమా,ఆవిడ అసలు కన్నతల్లినా అని ఆవేశంగా అడుగుతాడు గౌతమ్. ఆవిడే కన్నతల్లి అని మీకు ఎలా తెలుసు అంటుంది కృష్ణ. ఒకసారిగా షాక్ అవుతాడు గౌతమ్. కన్నతల్లి కాకపోతే వద్దనే రైట్స్ ఆవిడకి ఎందుకు ఉంటాయి అంటూ సమకప్పుకుంటాడు.
అయినా ఎందుకు వద్దంటుంది అంటాడు గౌతమ్. నా మీద నమ్మకం లేక అంటుంది కృష్ణ. ప్రస్తుతం తన పరిస్థితి ఎలాగ ఉంది అంటాడు గౌతమ్. ఇంతకుముందు ఎవరి మాట వినేది కాదు అందరిని ఏడిపించేది. అదృష్టం కొద్ది నాకు దగ్గర అయింది. నా మాట మాత్రమే వింటుంది. వాలెంటెన్స్ డే రోజు సిద్దు, సిద్దు అంటూ కలవరిస్తుంది అంటుంది కృష్ణ. మతిస్థిమితం తప్పిపోయిన తనకి నేను గుర్తొస్తున్నాను అనుకుంటాడు గౌతమ్.
ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అని అడుగుతుంది కృష్ణ. యాక్సెప్ట్ చేస్తాడు గౌతమ్. మరోవైపు కృష్ణ తో సరదాగా గడపాలని వెయిట్ చేస్తుంటాడు మురారి. ఆమెని పెళ్లి చేసుకొని ఏనాడు సరిగ్గా చూసుకోలేదు ఆమెని బయటికి తీసుకొని వెళ్తే అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతకంటా ముందు ఆమెకి ఏమైనా గిఫ్ట్ కొనాలి అనుకుంటాడు. ఏం కొనాలి అని ఆలోచిస్తూ ఉండగా చీర కొనాలి అని ఆలోచన వస్తుంది అతనికి.
పెద్ద షోరూం లో మంచి చీర కొనుక్కొని తీసుకువెళ్లాలి అనుకుంటూ బయలుదేరుతాడు మురారి. మరోవైపు నందిని గురించి ఆలోచిస్తున్న గౌతమ్ తనని నా దగ్గరికి తీసుకు రమ్మందాం అంటే వాళ్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో, అందుకే అనుమానం రాకుండా ఎక్కడికి రప్పించాలి, టెస్టులు అవి చేయించాలి ఎలా అంటూ ఆలోచనలో పడతాడు గౌతమ్.
అంతలోనే అతనికి ఏదో ఆలోచన రావటంతో తన రాక్ లోంచి ఏవో టాబ్లెట్స్ తీస్తాడు. తప్పైనా తప్పదు లేకపోతే నందిని కి జీవితాంతం గతం గుర్తు రాకుండానే చేస్తారు అనుకుంటాడు. మరోవైపు గౌతమ్ దగ్గరికి వచ్చిన కృష్ణ రౌండ్స్ అన్ని ఫినిష్ చేసేసాను భాను గారు కూడా రాలేదు చాలా బర్డెన్ పడింది అంటుంది కృష్ణ.
నేను నందిని కేసు స్టడీ చేస్తున్నాను అందుకే రాలేదు అంటాడు గౌతమ్. నిజమా అంటూ ఆనంద పడిపోతుంది, తనకి నయమవుతుంది కదా అంటుంది కృష్ణ. తప్పకుండా నయమవుతుంది కానీ దానికి పేషన్స్ అవసరం అంటాడు గౌతమ్. నాకు పేషెంట్స్ చాలా ఎక్కువ సార్ మీ దగ్గర అమ్మాయిలు ఎవరూ ఎక్కువ కాలం పనిచేయరంట కదా నేను మీ దగ్గర పని చేస్తున్నానంటేనే నాకెంత ఓపికో కదా అంటుంది కృష్ణ.
నీకు మైండ్ లో ఏమనిపిస్తే అది మాట్లాడేస్తావా అంటాడు గౌతమ్. అవును సార్ అంటూ మళ్ళీ తమాయించుకొని సారీ చెప్పి మీరు చెప్పండి సార్ అంటుంది కృష్ణ. ఈ టాబ్లెట్ నందిని కి వెయ్యు తనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది వచ్చిన వెంటనే వేరే హాస్పిటల్ కి కాకుండా మన హాస్పిటల్ కి తీసుకొని రా అంటాడు గౌతమ్. సైడ్ ఎఫెక్ట్స్ కచ్చితంగా వస్తాయా అంటుంది కృష్ణ అందరికీ కాదు కానీ కొంతమందికి వస్తాయి.
నందినికి నయమైతే అది నీవల్లే నయమైంది అని అందరూ అనుకోవాలి నావల్ల అని ఎవరు అని తెలియకూడదు అప్పుడే నిన్ను తింగరి పిల్ల అని ఎవరు అనరు అంటాడు గౌతమ్. థాంక్స్ గౌతమ్ సార్ మీరు చూడడానికి గుమ్మడి పండు లాగా ఉన్న మీ గుండె చాలా మంచిది అంటుంది కృష్ణ. అందుకే నిన్ను మీ ఇంట్లో తింగరి పిల్ల అంటున్నారు అంటాడు గౌతమ్. ఇంతలో ఫోన్ చూసిన కృష్ణ ఒక్కసారిగా అదిరిపోతుంది.
ఏమైంది అని అడుగుతాడు గౌతమ్. ఐదున్నర అయిపోయింది నేను ఇంట్లో ఎర్లీగా వస్తానని చెప్పాను మీకు కూడా చెప్పాను కదా అంటుంది కృష్ణ. వెల్దువు గానివిలే అని ఈజీగా చెప్తాడు గౌతమ్. తొందరగా రమ్మన్నారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది కృష్ణ. మరోవైపు కృష్ణ కి ఫోన్ చేస్తుంటాడు మురారి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ గౌతమ్ గాడు ఇంకా పనిచేయిస్తున్నాడేమో అనుకుంటాడు మురారి.
వాడెవడో కానీ ఒకసారి యూనిఫారంలో వెళ్లి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి అనుకుంటాడు. ఈ లోపు ఏదో ఫోన్ రావటంతో తన చేతిలో ఉన్న బ్యాగ్ ని అక్కడికి పెట్టి ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు మురారి. అది చూస్తుంది ముకుంద. మరోవైపు లేట్ అవుతుంది ఏసిపి సర్ ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అంటూ కంగారుపడుతుంది ముకుంద. ఇంతలో గౌతమ్ రావడంతో అతన్ని లిఫ్ట్ అడుగుతుంది.
నందినికి నేను ఎలాగైనా కనిపించాలి ఇంకెవరికి కనిపించకూడదు అంటే రిస్క్ చేయాలి అనుకుంటూ కృష్ణ కి లిఫ్ట్ ఇస్తాడు గౌతమ్. మరోవైపు మురారి తను తెచ్చిన బ్యాగ్ కోసం వెతుకుతుంటాడు. చీర ఎవరైనా చూస్తే లేనిపోని రచ్చ ఎక్కడ పెట్టాను అనుకుంటాడు. తరువాయి భాగంలో ఇప్పుడు ఏమంటారు? ఏపీ సార్ అంటుంది కృష్ణ ఏమీ లేదు అలాగే దూరమైపోతుండు అంటాడు మురారి. నేను దూరమయ్యేది లేదు,దగ్గర ఏదీ లేదు. ఇంకొక 11 నెలలు గడిస్తే వెళ్లిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటుంది కృష్ణ.