`శాకుంతలం` ఫస్ట్ కాపీ చూసిన సమంత.. ఆమె రియాక్షన్‌ ఏంటంటే?

Published : Mar 14, 2023, 01:46 PM ISTUpdated : Mar 14, 2023, 02:09 PM IST
`శాకుంతలం` ఫస్ట్ కాపీ చూసిన సమంత.. ఆమె రియాక్షన్‌ ఏంటంటే?

సారాంశం

సమంత ప్రధాన పాత్రలో నటించిన `శాకుంతలం` సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా సినిమాని ఫస్ట్ కాపీ చూసింది సామ్‌. తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది.

సమంత ముఖ్య పాత్రలో నటించిన చిత్రం `శాకుంతలం`. ఆమె ఇందులో శకుంతలగా నటించారు. మన ఇతిహాసాల్లోని కథలో రూపొందుతున్న చిత్రమిది. గుణ శేఖర్‌ రూపొందించారు. దేవ్‌ మోహన్‌, బన్నీ కూతురు అల్లు అర్హ, మోహన్‌బాబు, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. గత నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే నెలలో రాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని చూశారు సమంత. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఆమె ఫస్ట్ కాపీని చూశారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంది సమంత. ట్విట్టర్‌ వేదికగా ఆమె తన ఎగ్జైట్‌మెంట్‌ని షేర్‌ చేసుకుంది. `ఫైనల్లీ ఈ రోజు సినిమా చూశా. దర్శకులు గుణశేఖర్‌ నా మనసుని దోచేశారు. ఎంత అందమైన సినిమా ఇది. మన గొప్ప ఇతిహాసాలలో ఒకటి చాలా మనోహరంగా జీవం పోసింది. మా కుటుంబ ప్రేక్షకులు శక్తివంతమైన భావోద్వేగాలతో ముగ్దులవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక పిల్లలందరూ మా మాయా ప్రపంచాన్ని ప్రేమంచబోతున్నారు. ఇంతటి అద్భుతమైన ప్రయాణానికి కారణమైన నిర్మాతలు దిల్‌రాజు, నిలిమ గుణ లకు ధన్వవాదాలు. `శాకుంతలం`  నాకు బాగా దగ్గరైన చిత్రమవుతుంది` తన సంతోషాన్ని వెల్లడించింది సమంత. ఫ్యామిలీ ఆడియెన్స్ కి, పిల్లలకు ఇలా అందరికి ఈ సినిమా నచ్చుతుందన్నారు. ఆ ఎమోషన్స్ తో ట్రావెల్‌ చేస్తారని సమంత వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్‌ వర్క్ పతాకాలపై దిల్ రాజు, నీలిమా గుణ నిర్మించారు. 

సమంత.. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె నుంచి వస్తోన్న రెండో చిత్రమిది. మొదటగా ఆమె `యశోద` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. తన సినిమాల్లో హీరో ఉండాల్సిన పనిలేదని చాటి చెప్పింది. ప్రస్తుతం సమంత .. విజయ్‌ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. ఇది ఇప్పుడు కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చాలా రోజులు తర్వాత మళ్లీ సమంత ఎంట్రీతో ఈ సినిమా తిరిగి షూటింగ్‌ స్టార్ట్ అయ్యింది. శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. 

మరోవైపు హిందీలో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది సమంత. హాలీవుడ్‌ పాపులర్‌ వెబ్ సిరీస్‌ `సిటాడెల్‌` రీమేక్‌లో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నారు. ఇది కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు సమంత చేతిలో ఉన్నారు. మయో సైటిల్‌ వ్యాధి నుంచి కోలుకున్నాక ఆమె తిరిగి ఫిట్‌నెస్‌ని పొందింది. అందుకోసం జిమ్‌లో శ్రమించింది. ఇప్పుడు మరోసారి దున్నేసేందుకు రెడీ అవుతుంది సమంత. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా