
విశ్వక్సేన్ హీరోగా రీసెంట్ గా వచ్చిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఆగిపోయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రను పోషించింది. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులలో ఫుల్ బిజి అయ్యిపోయారు. దర్శకుడు కృష్ణ చైతన్య కూడా మరో ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేసినట్లు తెలుస్తోంది.
అది మరేదో కాదు 2021 లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా పవర్ పేట సినిమా తెరకెక్కబోతుందంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత బడ్జెట్ ఇష్యూలతో సహా రకరకాల కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని డైరెక్టర్ భావించటంతో అందుకు చాలా టైం పడుతుంది అనే కారణంతో నితిన్ ఈ సినిమాను పక్కకు పెట్టాడని చెప్పుకున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణ చైతన్య ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. విశ్వక్సేన్ ని ఈ ప్రాజెక్టు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే చర్చలు పూర్తైనట్లు తెలుస్తోంది. 1960 2021 మధ్య ఈ కథ ఉండనుందని అలాగే విశ్వక్ మూడు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. 18 ఏళ్ల టీనేజ్ పాత్ర, రెండవది 40 ఏళ్ల వ్యక్తి, మూడవది 60 సంవత్సరాలు ముసలి వాడు గా కనిపించనున్నాడట.
ఇక కృష్ణ చైతన్య గతంలో రౌడీ ఫెల్లో, ఛల్ మోహన రంగ సినిమాలకు దర్శకత్వం వహించాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దర్శకుడిగా అతడి మూడో సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వక్‌సేన్ తెలుగులో ఓ మూడు సినిమాలు చేయబోతున్నాడు. విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మెకానిక్ రాఖీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే లైలా అనే మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా లైలా సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇందులో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు విశ్వక్ సేన్.