పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ కి కష్టాలు తప్పవా ?

Published : Jul 12, 2024, 06:53 PM IST
పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ కి కష్టాలు తప్పవా ?

సారాంశం

లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి కూడా తనని తాను ప్రూవ్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ లైగర్ వల్లే డబుల్ ఇస్మార్ట్  రిలీజ్ కి కష్టాలు తప్పేలా లేవు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం  డబుల్ ఇస్మార్ట్.  లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. కానీ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి కూడా తనని తాను ప్రూవ్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. 

కానీ లైగర్ వల్లే డబుల్ ఇస్మార్ట్  రిలీజ్ కి కష్టాలు తప్పేలా లేవు. నైజాం ఏరియాలో లైగర్ చిత్రాన్ని వరంగల్ శ్రీను రిలీజ్ చేశారు. వరంగల్ శ్రీను ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఆ డబ్బుతో లైగర్ చిత్రాన్ని కొన్నారు. భారీగా నష్టాలు వచ్చాయి. అగ్రిమెంట్ ప్రకారం పూర్తి నష్టాలు ఏమీ తీర్చాల్సిన అవసరం లేదు. వరంగల్ శ్రీను కూడా సేఫ్ ఎందుకంటే అది ఎగ్జిబిటర్ల డబ్బు. నష్టపోయింది ఎగ్జిబిటర్లే. 

దీనితో ఎగ్జిబిటర్లు అంతా పూరి జగన్నాధ్ పై కత్తి కట్టి ఉన్నట్లు సమాచారం. లైగర్ విషయంలో ఏదో  డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తమ థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదని తీర్మానించినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. అయితే మరికొందరు బయ్యర్లు డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ లైగర్ తో నష్టపోయిన వారికి కాకుండా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని వేరొకరికి ఇస్తే కూడా ఒప్పుకోకూడదు ని బయ్యర్లు పట్టుబడుతున్నారట. మరి పూరి జగన్నాధ్, ఛార్మి ఎంత చాకచక్యం ప్రదర్శిస్తారు .. ఈ కష్టం నుంచి ఎలా బయట పడతారు అనేది ఆసక్తిగా మారింది. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?