`గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` ఏ OTT లో.. ఎప్పటి నుంచంటే

Published : Jun 01, 2024, 12:09 PM IST
`గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` ఏ OTT లో.. ఎప్పటి నుంచంటే

సారాంశం

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.ఈ సినిమాలో నటి అంజలి తనదైన యాక్టింగ్ తో ఎంతగానో మెప్పించింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి " .ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ సినిమా ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది .క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ డిటేల్స్ వివరాలు బయిటకు వచ్చాయి.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ఏ సినిమా హక్కులను తీసుకన్నా  నాలుగు వారాల రూల్ ను ఫాలో అవుతుంది. ఈ సినిమా విషయంలో అవే రూల్స్ పాటిస్తారో లేక అంతకంటే ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. నాలుగు వారాల నిబంధన పాటిస్తే జూన్ 28వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.
 
ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.ఈ సినిమాలో నటి అంజలి తనదైన యాక్టింగ్ తో ఎంతగానో మెప్పించింది.ఇక హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామర్ తో పాటు నటన పరంగా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే సినిమాకు ఫేక్ రివ్యూస్ ఇచ్చే వారిపై హీరో విశ్వక్ సేన్ మండి పడ్డాడు.మూవీ టికెట్స్ కొన్నవారే “బుక్ మై షో “లో రివ్యూలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విశ్వక్ సేన్ తెలిపారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ఉదయం 6 గంటల నుంచే రివ్యూలు వచ్చినట్లు విశ్వక్ తెలిపారు.దీనిని బట్టి వారు సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చారన్న విషయం అర్ధం అవుతుందని విశ్వక్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్
తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?