Bachchan pandey:ఇది మన వరుణ్ తేజ్ సినిమా కాపీలా ఉందే

By Surya Prakash  |  First Published Jan 19, 2022, 4:58 PM IST

2020 క్రిస్మస్‌కి విడుదలవ్వాల్సిన సినిమా ఇది. 2021 జనవరి 22కి వాయిదా పడింది. సెకెండ్ వేవ్ వల్ల మరోసారి ఆగింది. దాంతో ఇక ఓటీటీ రిలీజ్‌కి ఫిక్సయ్యారని అన్నారు. 


తెలుగు నుంచి హిందీకు రీమేక్ లు వెళ్లటం కామన్ గా జరిగే పని. అయితే అవన్నీ అఫీషియల్ గా జరుగుతూంటాయి. కానీ అప్పుడప్పుడూ ఎత్తిపోతల పధకాలు అంటే కాపీలు కూడా జరుగుతూంటాయి. అయితే అక్కడ పెద్ద హీరో చేస్తే రిలేషన్స్ పోగొట్టుకోవటం ఎందుకున్నట్లు ఊరుకుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో దాన్ని కాపీ అనాలో ప్రేరణ అనాలో...అఫీషియల్ కాపీ అనాలో అర్దం కాదు. అలాంటిదే ఇప్పుడు అక్షయ్ కుమార్ తాజా చిత్రానికి అనిపిస్తోంది.

కోవిడ్ పరిస్థితులు కాస్త చక్కబడ్డాక వరసపెట్టి బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్‌రంగీరే చిత్రాలతో మళ్లీ థియేటర్స్‌లోకి దూకాడు అక్షయ్. అయితే క్రేజ్ ఉన్న బచ్చన్‌ పాండే మూవీ మాత్రం రిలీజ్ అవ్వలేదు. 2020 క్రిస్మస్‌కి విడుదలవ్వాల్సిన సినిమా ఇది. 2021 జనవరి 22కి వాయిదా పడింది. సెకెండ్ వేవ్ వల్ల మరోసారి ఆగింది. దాంతో ఇక ఓటీటీ రిలీజ్‌కి ఫిక్సయ్యారని అన్నారు.  కానీ  బచ్చన్ పాండే చిత్రాన్ని వచ్చే మార్చ్ 18న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటన వచ్చింది.

Latest Videos

ఫర్హాద్ సామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన తమిళ సూపర్‌‌ హిట్ ‘జిగర్తాండ’కి రీమేక్. ఈ సినిమా తెలుగు రీమేక్ గానే గద్దల కొండ గణేష్ చిత్రం వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ హిందీ సినిమా కొత్త పోస్టర్ చూస్తూంటే  ‘జిగర్తాండ’కి రీమేక్ రైట్స్ తీసుకుని, గద్దల కొండ గణేష్ ని రీమేక్ చేసారంటున్నారు. నిజమే అయితే  ఓ రకంగా అది అఫిషియల్ కాపీ లాంటిదన్నమాట.
 
 కరోనా మూడో వేవ్‌ కొనసాగుతున్న వేళ బాలీవుడ్‌లో ఈ నెల్లో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. వచ్చే నెల్లో రానున్న చిత్రాల రాక దాదాపు అనుమానమే. మార్చి నుంచి పరిస్థితులు కొంత మెరుగయ్యే అవకాశం ఉండటంతో మార్చి ద్వితీయార్ధం నుంచి విడుదల చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా  అక్షయ్‌కుమార్‌ నటించిన ‘బచ్చన్‌ పాండే’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే మార్చి 4న రావాలి. మార్చి 18న హోలీ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కొత్త పోస్టర్‌తో ప్రకటించింది చిత్ర టీమ్. యాక్షన్‌ కామెడీ రొమాన్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫర్హాద్‌ శామ్‌జీ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్‌ నాయికగా నటిస్తోంది.
 

click me!