Poonam Pandey: బిగ్ బాస్ హౌస్ అంటే భయం అంటున్న పూనమ్ పాండే... సోషల్ మీడియాలో విమర్శల దాడి!

By Sambi ReddyFirst Published Jan 19, 2022, 4:29 PM IST
Highlights


వివాదాస్పద నటి పూనమ్ పాండే కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. బిగ్ బాస్ షోకి వెళ్లడమంటే భయమంటూ ఆమె చేసిన కామెంట్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 

బోల్డ్ పోజులు కామెంట్స్ తో పూనమ్ పాండే (Poonam Pandey)తరచుగా వార్తల్లో ఉంటారు. వివాదాస్పద నటిగా ఉండాల్సినంత పేరుంది ఈమెకు. అలాగే ఈమె చర్యలపై నెటిజెన్స్ విరుచుకుపడుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా పూనమ్ బిగ్ బాస్ షో గురించి కొన్ని కామెంట్స్ చేశారు. మీరు బిగ్ బాస్ షోకి వెళతారా? ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బిగ్ బాస్ షోకి వెళ్లాలంటే నాకు భయం అన్నారు. 

నాకు తినడం చాలా ఇష్టం. కానీ బిగ్ బాస్ (Bigg Boss)షోలో కడుపునిండా తినడానికి కుదరదు. ఒక్కోసారి అసలు ఏమీ తినకుండా కంటెస్టెంట్స్ కడుపు మాడ్చుకోవాల్సి వస్తుంది. అది నావల్ల కాదు. నేను బిగ్ బాస్ షోని ఎంతగానో ఇష్టపడతాను. అయితే నేను మాత్రం పాల్గొనలేను... అని తన అభిప్రాయం వెల్లడించారు. అలాగే అనేక సార్లు బిగ్ బాస్ నిర్వాహకుల నుండి పిలుపు వచ్చింది, కానీ ఆసక్తి లేకపోవడంతో నేను వెళ్ళలేదన్నారు.  ఇక ఏమాత్రం సందు దొరికినా పూనమ్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉండే నెటిజెన్స్ ఈ విషయంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. 

ఇక పోర్నోగ్రఫీ కేసులో ఆమెకు ఊరట లభించింది. ముంబై హై కోర్ట్ ఆమె ముందస్తు బెయిలు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వగా... సుప్రీం కోర్ట్ లో ఆమెకు ముందస్తు బెయిల్ ని సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె అరెస్ట్ నుండి తప్పుకున్నారు. 

కాగా పూనమ్ పాండే వైవాహిక జీవితంలో కూడా అన్నీ వివాదాలే. ఆమె 2020 సెప్టెంబర్ 1న బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 10 రోజులకే గోవాలో సామ్ బాంబే మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది.పూనమ్ కంప్లైంట్ ఆధారంగా సామ్ బాంబేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. మరలా కాంప్రమైజ్ అయిన ఈ జంట కలిసి ఉంటున్నారు. ఇద్దరూ గొడవపడటం, కలిసిపోవడం కామనైపోయింది. 

click me!