
గురువారం రోజు జయసుధ జ్యూరీ ఛైర్ పర్సన్ గా 2024 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. నేడు శుక్రవారం రోజు మురళి మోహన్ జ్యూరీ ఛైర్మన్ గా 2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డుని అనౌన్స్ చేశారు. ప్రతి ఏడాది టాప్ 3 బెస్ట్ ఫీచర్ ఫిలిమ్స్ ని ఎంపిక చేశారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన ప్రతి చిత్రాన్ని పరిగణలోకి తీసుకుని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు ఎఫ్ డీ సీ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డుల కోసం ఎంపికైన ఉత్తమ చిత్రాల వివరాలు ఇక్కడ చూడవచ్చు.
మొదటి ఉత్తమ చిత్రం - రన్ రాజా రన్
రెండవ ఉత్తమ చిత్రం - పాఠశాల
మూడవ ఉత్తమ చిత్రం - అల్లుడు శీను
మొదటి ఉత్తమ చిత్రం - రుద్రమ దేవి
రెండవ ఉత్తమ చిత్రం - కంచె
మూడవ ఉత్తమ చిత్రం - శ్రీమంతుడు
మొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతి
రెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులు
మూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్
మొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి 2
రెండవ ఉత్తమ చిత్రం - ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం - ఘాజి
మొదటి ఉత్తమ చిత్రం - మహానటి
రెండవ ఉత్తమ చిత్రం - రంగస్థలం
మూడవ ఉత్తమ చిత్రం - కేరాఫ్ కంచరపాలెం
మొదటి ఉత్తమ చిత్రం - మహర్షి
రెండవ ఉత్తమ చిత్రం - జెర్సీ
మూడవ ఉత్తమ చిత్రం - మల్లేశం
మొదటి ఉత్తమ చిత్రం - అల వైకుంఠపురములో
రెండవ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటో
మూడవ ఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్
మొదటి ఉత్తమ చిత్రం - ఆర్ఆర్ఆర్
రెండవ ఉత్తమ చిత్రం - అఖండ
మూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన
మొదటి ఉత్తమ చిత్రం - సీతారామం
రెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2
మూడవ ఉత్తమ చిత్రం - మేజర్
మొదటి ఉత్తమ చిత్రం - బలగం
రెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్
మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి
ఉత్తమ చిత్రాలతో పాటు 6 ప్రత్యేక అవార్డులని కూడా ప్రకటించారు.
ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు : నందమూరి బాలకృష్ణ
బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు : సుకుమార్
పైడి జైరాజ్ ఫిలిం అవార్డు : మణిరత్నం
నాగిరెడ్డి- చక్రపాణి ఫిలిం అవార్డు : అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావు ఫిలిం అవార్డు : విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్