హరిహర వీరమల్లు నిర్మాత అపస్మారక స్థితిలోకి వెళ్ళారా ? ఆరోగ్యంపై వదంతులు.. ఇదిగో క్లారిటీ

Published : May 30, 2025, 11:33 AM ISTUpdated : May 30, 2025, 11:34 AM IST
AM Ratnam

సారాంశం

హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే రూమర్స్ ఆందోళన కలిగించాయి. అయితే ఆయన సోదరుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. 

హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం గురించి ఆందోళన కలిగించే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వ్యాపించాయి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్ లో నిర్మించారు. జూన్ 12న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

అపస్మారక స్థితిలో హరిహర వీరమల్లు నిర్మాత ?

రిలీజ్ కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏఎం రత్నం ఆరోగ్యానికి సంబంధించిన రూమర్స్ అందరినీ షాక్ కి గురి చేశాయి. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, అధిక బీపీ కారణంగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఫ్యాన్స్ కంగారు పడుతున్న నేపథ్యంలో ఏఎం రత్నం సోదరుడు దయాకర్ రావు ఇచ్చిన క్లారిటీతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

రూమర్స్ కి చెక్ పెట్టిన ఏఎం రత్నం సోదరుడు

ఈ విషయాన్ని ఖండిస్తూ దయాకర్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టత ఇచ్చారు. “అన్నయ్య ఏఎం రత్నం గురించి వచ్చిన రూమర్స్ నమ్మకండి. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి,” అని పేర్కొన్నారు. హరి హర వీరమల్లు రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఒత్తిడి కారణంగా ఏఎం రత్నంకి బీపీ పెరిగిందని, అందువల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లారని కొందరు రూమర్స్ వైరల్ చేశారు. 

 

 

హరి హర వీరమల్లు చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రం జూన్ 12న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన తారా తారా సాంగ్ బాగా వైరల్ అయింది. త్వరలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రెడీ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే