Urvasivo Rakshasivo : అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' నుంచి ఫన్ ఫుల్ టీజర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్.!

By team teluguFirst Published Sep 29, 2022, 6:11 PM IST
Highlights

యంగ్ హీరో అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’ (Urvashivo Rakshashivo). ఈ చిత్రం నుంచి తాజాగా ఫన్ ఫుల్ టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 
 

యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’ (Urvashivo Rakshashivo). హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోంది. ఈ ఆధునిక రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో 'ప్రేమ కాదంట' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో'గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపుగా పూర్తికావడంతో ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు మేకర్స్.  ఈ సందర్భంగా మూవీ టీజర్ ను వదిలారు. 

చాలా రోజుల క్రితమే ఈ సినిమాని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల రోజుల ముందే మేకర్స్ సినిమా ప్రమోషన్‌లో అడుగుపెట్టారు. తాజాగా ఫన్ ఫుల్ రొమాంటిక్ టీజర్‌తో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. టీజర్‌లో అల్లు శిరీష్‌ని పూర్తిగా కొత్తగా చూపించారు. ఇంట్లో మంచి అబ్బాయిలా నటిస్తూనే అతని రొమాంటిక్ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ కనిపిస్తాడు అల్లు శీరిష్. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు. యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్,టీజర్ చూస్తుంటే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.

"ఉర్వశివో రాక్షసివో".చిత్రాన్ని నవంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి జిఎ 2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. తన్వీర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు. అల్లు శీరిస్ చివరిగా ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందారు. ప్రస్తుతం "ఉర్వశివో రాక్షసివో"తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

 

Presenting you all the teaser of ❤️

A modern day love story ❤️‍🔥
▶️ https://t.co/YzI7xvadDY

In theaters, Nov 4th! pic.twitter.com/Brff91AVz2

— GA2 Pictures (@GA2Official)
click me!