`ఆదిపురుష్‌` సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌.. ముందే టీజర్‌ పోస్టర్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ సెలబ్రేషన్‌ షురూ

Published : Sep 29, 2022, 05:33 PM ISTUpdated : Sep 29, 2022, 05:35 PM IST
`ఆదిపురుష్‌` సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌.. ముందే టీజర్‌ పోస్టర్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్  సెలబ్రేషన్‌ షురూ

సారాంశం

ప్రభాస్‌ ఫ్యాన్స్ ముందుగానే సర్‌ప్రైజ్‌ రెడీ అవుతుంది. `ఆదిపురుష్‌` టీజర్‌ కంటే ముందే టీజర్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. అందుకు టైమ్‌ ఫిక్స్ చేశారు.

`ఆదిపురుష్‌` టీమ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్ కి బ్యాక్‌ టూ బ్యాక్‌ సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌చేసింది. ఇన్నాళ్లు సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వని టీమ్‌ ఇప్పుడు గ్యాప్‌లేకుండా ట్రీట్‌లు ఇవ్వబోతుంది. `ఆదిపురుష్‌` టీజర్‌ని అక్టోబర్‌ 2న అయోధ్యలో విడుదల చేయబోతున్నారు. గ్రాండ్‌గా ఈవెంట్‌ ప్లాన్‌ చేసి మరీ ఈ టీజర్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు అంతకంటే ముందే మరో సర్ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. రేపే టీజర్‌ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్‌ రాలేదు. ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉండబోతుందో అనేది కూడా పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో టీజర్‌ పోస్టర్‌ ఇప్పుడు రిలీజ్‌ చేయబోతుంది. సెప్టెంబర్‌ 30న `ఆదిపురుష్‌` టీజర్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నట్టు యూనిట్‌ తెలిపింది. ఓ రకంగా ఇదే ఫస్ట్ లుక్‌గా ఉండబోతుందని అంటున్నారు. దీంతో సినిమాపై హైప్‌ అమాంతం పెరిగిపోయింది. 

టీజర్‌ పోస్టర్‌ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దీన్ని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. మరి ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉండబోతుందో అనేది తెలియాలంటే ఒక్క రోజు ఓపిక పట్టాల్సిందే. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన `ఆదిపురుష్‌` చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతుండగా, సీతగా కృతిసనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్