`పుష్ప2` పోస్ట్ పోన్‌ వార్తలకు చెక్‌.. కౌంట్‌డౌన్‌ ప్రకటించిన టీమ్‌..

Published : Jan 29, 2024, 08:34 PM IST
`పుష్ప2` పోస్ట్ పోన్‌ వార్తలకు చెక్‌.. కౌంట్‌డౌన్‌ ప్రకటించిన టీమ్‌..

సారాంశం

అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప 2` రిలీజ్‌కి సంబంధించిన అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఏకంగా కౌంట్‌ డౌన్‌ ప్రకటించింది. 

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ `పుష్ప 2`. ఇది రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి రెండో పార్ట్. మొదటి పార్ట్ కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో రెండో పార్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఎలా ఉంటుందనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఆడియెన్స్ లో ఉన్న అంచనాలు, డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్‌తో, మరింత లార్జ్ స్కేల్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. 

ప్రస్తుతం `పుష్ప2` శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఔట్‌పుట్‌ విషయంలో రాజీపడని దర్శకుడు సుకుమార్‌, సాటిస్పైగా లేని సీన్లని మళ్లీ రీ షూట్‌ చేస్తున్నారట. అదే సమయంలో ఇప్పటి వరకు ఎంత వరకు షూటింగ్‌ జరిగిందనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో `పుష్ప2`పై రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. చాలా రోజులుగా వినిపిస్తుంది. ఇటీవలే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందియూనిట్‌. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. 

ఈ సారి ఏకంగా కౌంట్‌ డౌన్‌ ప్రకటించింది. సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయాలని టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. దీంతో తాజాగా అదే డేట్‌కి కౌంట్‌ డౌన్‌ ప్రకటించింది. నేటితో 200 రోజుల్లో ఈ మూవీ విడుదల కానుందని తెలిపింది యూనిట్‌. మరో 200 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప రూల్స్ బిగిన్‌ అంటూ వెల్లడించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. దీంతో రిలీజ్‌ డేట్‌పై వస్తోన్న అనేక రూమర్లకి చెక్‌ పెట్టినట్టయ్యింది. రిలీజ్‌ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతుంది. 

ఇక `పుష్ప2`ని రాజీపడకుండా రూపొందిస్తున్నారు సుకుమార్. మంచి కమర్షియల్‌ అంశాలను జోడిస్తున్నారు. ఇందులో బన్నీ లుక్‌ అదిరిపోయేలా ఉంటుందని, ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో అమ్మోరు వేషాధారణలో ఆకట్టుకుంటాడని, అక్కడ యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు మొదటి పార్ట్ లో `ఊ అంటావా మావ` సాంగ్‌ తరహాలో మరో స్పెషల్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేస్తున్నారని, ఇందులో ఇద్దరు హీరోయిన్లని దించుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇక అల్లు అర్జున్‌కి నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌, అజయ్ ఘోష్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ మూవీ బడ్జెట్‌పై పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు నాలుగు వందల కోట్లు అవుతుందని తెలుస్తుంది. అనుకున్నదానికంటే చాలా ఎక్కువవుతుందని, నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నట్టు టాక్‌.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్