ప్రొమోషన్స్ జోరు పెంచిన జక్కన్న... ఆర్ ఆర్ ఆర్ నుండి మొదటి సాంగ్ వచ్చేస్తుంది!

By team teluguFirst Published Jul 27, 2021, 11:40 AM IST
Highlights

ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల దోస్తీని ప్రతిబింబిస్తూ ఆర్ ఆర్ ఆర్ నుండి దోస్తీ సాంగ్ విడుదల చేస్తున్నారు. 

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ మరి కొద్ది నెలల్లో విడుదల కానుంది. ప్రకటించిన విధంగా అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు కూడా పెంచారు. ఇక ఆర్ ఆర్ ఆర్ నుండి మొదటి సాంగ్ ఆగస్టు 1న ఫ్రెండ్షిప్ డే కానుకగా విడుదల చేస్తున్నారు. 


ఆర్ ఆర్ ఆర్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు తీసుకెళుతుండగా, ఆర్ ఆర్ ఆర్ నుండి విడుదలయ్యే మొదటి సాంగ్ ఎలా ఉంటుందనే ఆత్రుత అందరిలో మొదలైపోయింది. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల దోస్తీని ప్రతిబింబిస్తూ ఆర్ ఆర్ ఆర్ నుండి దోస్తీ సాంగ్ విడుదల చేస్తున్నారు. 


ఈ సాంగ్ కోసం అనిరుధ్, విజయ్ ఏసుదాస్, అమిత్ త్రివేది, యాజిన్ నిజార్, హేమ చంద్ర కీరవాణి టీమ్ లో జాయిన్ అయ్యారు. వివిధ పరిశ్రమలకు చెందిన ఈ స్టార్ సింగర్స్ ఎంట్రీతో సాంగ్ పై మరింత ఆసక్తి  నెలకొంది. మొత్తంగా మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి ఘనుడని మరోమారు నిరూపిస్తున్నారు. బాహుబలి 2 విజయంలో రాజమౌళి ప్రొమోషన్స్ టెక్నీక్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. 


ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీ స్టారర్ లో అజయ్ దేవ్ గణ్, సముద్ర ఖని కీలక రోల్స్ చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రేయా మరో కీలక పాత్ర చేస్తున్నారు. 
 

The First Song from on August 1st, 11 AM.🤝 🔥🌊

An Musical.🎵

🎤 pic.twitter.com/dyBaFxQPxt

— RRR Movie (@RRRMovie)
click me!