సాలే గారు సినిమా చూశాక ఏమంటున్నాడో తెలుసా...

First Published Jan 11, 2018, 4:32 PM IST
Highlights
  • పవన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి
  • ఫ్రెంచ్ మూవీ కాపీ అని టాక్ రావటంతో స్పందించిన దర్శకుడు జెరోమ్ సాలే
  • తన లార్గో వించ్ మూవీలానే వుందంటూ, టి సిరీస్ డీల్ సరిపోదంటూ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రానికి విడుదలకు ముందే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ప్రధానంగా అజ్ఞాతవాసి చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ను కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ సినిమా రీమేక్ రైట్స్ పొందిన బాలీవుడ్ కు చెందిన టి-సిరీస్ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో వాళ్లతో సెటిల్మెంట్ చేసుకున్నారనే టాక్ వినిపించింది.



దీంతో అజ్ఞాతవాసి కాపీ ఆరోపణలు ఒరిజినల్ మూవీ లార్గో వించ్ తెరకెక్కించిన ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సాలే దాకా కూడా వెళ్లాయి. దీంతో అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు తాను సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన ఫ్రెంచ్ దర్శకుడు..  సినిమా రిలీజయ్యాక స్వయంగా చూసి ఓ ట్విట్ కూడా పెట్టాడు.

 

‘‘టి-సిరీస్ తో చేసుకున్న సెటిల్మెంట్ సరిపోదేమో అని నేను భయపడుతున్నాను. ఇది కేవలం ఇండియాకు సంబంధించిన విషయం కాదు. అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ’’ అని జెరోమ్ సాలే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు అర్థం తనతో కూడా ఇష్యూ సెటిల్ చేసుకోవాలనీ, లేకుంటే లీగల్ యాక్షన్ దాకా వెళ్లాల్సి వస్తుందన్నట్టుగా చెప్పకనే చెప్పాడని కొందరు విశ్లేషిస్తున్నారు.

 

అయితే అసలు లార్గో వించ్ సినిమా ఫ్రెంచ్ లో హిట్ మూవీ ఏం కాదు.  అదే స్టోరీ ఎత్తేశారు అంటూ టాక్ వినిపిస్తున్న అజ్ఞాతవాసి కూడా ఫ్లాప్ టాక్ మూట గట్టుకుంది. తన సినిమా సక్సెస్ అయిందయినా లేక ఇప్పుడు రిలీజైన అజ్ఞాతవాసి సూపర్ డూపర్ హిట్టైనా జెరోమ్ సాలే రీమేక్ రైట్స్ గురించి డిమాండ్ చేయటంలో అర్థం వుండేదని అంటున్నారు మరికొందరు. ఇంతకీ ఈ ఇష్యూ సెటిలైందా లేదా తేలాలి.  

click me!