నలుగురు పాన్‌ ఇండియా స్టార్లని పరిచయం చేసిన ఒకే ఒక్క నిర్మాత, ఆ ఒక్కరితో చేయడానికి యాభై ఏళ్లు

By Aithagoni Raju  |  First Published Sep 30, 2024, 6:31 PM IST

 మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను హీరోలుగా పరిచయం చేసింది ఒకే ఒక్క నిర్మాత కావడం విశేషం. అలాంటిది గ్లోబల్‌ స్టార్‌తో మాత్రం సినిమా చేయడానికి యాభై ఏళ్లు పట్టింది. ఆ కథేంటో చూస్తే, 


ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలంతా పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ ని దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభాస్‌, బన్నీ, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాన్‌ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళితో మహేష్‌ బాబు కూడా పాన్‌ ఇండియా జాబితాలో చేరబోతున్నారు. టైర్‌ 2 హీరోలను, సీనియర్లని పక్కన పెడితే ఈ ఐదుగురు హీరోలు పాన్‌ ఇండియా ఇమేజ్‌తో కొనసాగుతున్నారు. అలాంటి సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు పాన్‌ ఇండియా హీరోలను ఒకే ఒక్క నిర్మాత హీరోలుగా పరిచయం చేయడం విశేషం. మరి ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Videos

యాభై ఏళ్ల తర్వాత ఇండియన్‌ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా `కల్కి`..

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా ఇటీవల విడుదలై కలెక్షన్ల దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. నాగ్‌ అశ్విన్‌ చేసిన మ్యాజిక్ కి ప్రభాస్‌ ఇమేజ్‌, యాక్షన్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ విశ్వరూపానికి, కమల్‌ మెరుపులకు, దీపికా అద్భుత నటనకు ఆడియెన్స్ బ్రహ్మారథం పట్టారు. సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఇది తెరకెక్కింది. ఇంతటి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించింది వైజయంతి మూవీస్‌. నిర్మాత అశ్వినీదత్‌. ఆయన ఈ బ్యానర్‌ని యాభై ఏళ్ల క్రితం స్థాపించారు. 1974లో ఎన్టీ రామారావు చేతుల మీదుగా దీన్ని లాంచ్‌ చేశారు. ఆయనే పేరు పెట్టడంతోపాటు ఆయన కృష్ణుడి రూపంలో ఉన్న ఫోటోనే లోగోగా పెట్టుకున్నారు అశ్వినీదత్‌. 

 

`రాజకుమారుడు`తో మహేష్‌ బాబు ఎంట్రీ..

అశ్వినీదత్‌ ఇప్పటి వరకు ఎన్టీ రామారావు నుంచి దుల్కర్‌ సల్మాన్‌ వరకు ఎంతో మందితో సినిమాలు చేశారు. ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లు పరిచయం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అయితే ఆయన పరిచయం చేసిన వారిలో నాలుగురు పాన్‌ ఇండియా స్టార్లు ఉండటం విశేషం. మరో స్టార్‌ హీరో కూడా ఉన్నారు. వాళ్లెవరో కాదు మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌ చరణ్‌, కళ్యాణ్‌ రామ్‌. మహేష్‌ బాబుని హీరోగా పరిచయం చేయాలని కృష్ణ చెబితే `రాజకుమారుడు` నిర్మించారు అశ్వినీదత్‌. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఈ మూవీ తెరకెక్కింది. ఇది బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత స్టార్‌ హీరోగా ఎదిగారు మహేష్‌. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్నారు. పాన్‌ ఇండియాకాదు ఏకంగా ఇంటర్నేషనల్‌ స్టార్‌ కాబోతున్నారు. 

  జూ. ఎన్టీఆర్‌ కోసం స్వప్ప సినిమాస్‌..

అలాగే జూ ఎన్టీఆర్‌ని సైతం ఆయనే హీరోగా పరిచయం చేశాడు. మొదటగా ఎన్టీఆర్‌ హీరోగా `స్టూడెంట్‌ నెం 1` మూవీని ప్రారంభించారు. దీనికి రాజమౌళి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ కూడా స్టార్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాలతో డిలే అయ్యింది. ఈ క్రమంలో `నిన్ను చూడాలని` అనే మూవీ రామోజీ రావు ప్రొడక్షన్‌లో చేయాల్సి వచ్చింది. దానికి వీఆర్‌ ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ మొదట ప్రారంభమైన `స్టూడెంట్‌ నెం 1` పెద్ద హిట్‌ అయ్యింది. దీన్ని అశ్వినీదత్‌ మరో ప్రొడక్షన్‌ తన కూతురు పేరుతో స్వప్న సినిమాస్‌ స్థాపించి నిర్మించడం విశేషం. అలా హిట్‌తో ప్రారంభమైన ఎన్టీఆర్‌ జర్నీ ఇప్పుడు `దేవర` వరకు కొనసాగింది. `దేవర` మిశ్రమ స్పందనతో రన్‌ అవుతుంది. కానీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. మూడు రోజుల్లోనే ఇది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. ఇలా పాన్‌ ఇండియా స్టార్‌గా తన సత్తాని చాటుతున్నారు తారక్‌. 

`గంగోత్రి`తో అల్లు అర్జున్‌ ఎంట్రీ..

అంతేకాదు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ని పరిచయం చేసింది కూడా అశ్వినీదత్తే. బన్నీని హీరోగా పరిచయం చేస్తూ కె రాఘవేంద్రరావు `గంగోత్రి` సినిమాని రూపొందించారు. దీన్ని అల్లు అరవింద్‌తో కలిసి అశ్వినీదత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్‌ కలిసి నిర్మించాయి. ఈ చిత్రం కూడా బాగానే ఆడింది. ఆ తర్వాత `ఆర్య`తో బ్రేక్‌ అందుకుని ఇప్పుడు పాన్‌ ఇండియా  స్టార్‌ అయిపోయారు బన్నీ. `పుష్ప` సినిమాతో ఆయన రేంజ్‌ పెరిగిపోయింది. ఇప్పుడు `పుష్ప 2`తో గ్లోబల్‌ మార్కెట్ ని టార్గెట్‌ చేశారు. 
 

`చిరుత` సినిమాతో రామ్‌ చరణ్‌ ఎంట్రీ..

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్న రామ్‌ చరణ్‌ని హీరోగా పరిచయం చేసింది కూడా అశ్వినీదత్తే కావడం విశేషం. `చిరుత` సినిమాకి ఆయనే నిర్మాత. చిరంజీవి కావాలని వైజయంతి మూవీస్‌లో పరిచయం చేయించారు. నిర్మాతతో చిరుకి ఉన్న అనుబంధంతో చరణ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతలు అశ్వినీదత్‌కి అప్పగించారు. పూరీ జగన్నాథ్‌ రూపొందించిన ఈ చిత్రం చరణ్‌కి బెస్ట్ ఎంట్రీగా నిలిచింది. మాస్‌ హీరోగా అదరగొట్టాడు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా హీరో అయిన చరణ్‌ ఇప్పుడు`గేమ్‌ ఛేంజర్‌`తో మరోసారి పాన్‌ ఇండియా వైడ్‌గా తన సత్తా చాటబోతున్నారు. ఆయనతోపాటు మరో నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ కూడా వైజయంతి మూవీస్‌లోనే హీరోగా పరిచయం అయ్యారు. స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. మంచి బ్లాక్‌ బస్టర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. 

సో ఇలా నిర్మాత అశ్వినీదత్ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ, తన జర్నీని గుర్తు చేసుకున్నారు. అందరు హీరోలు తనకు సపోర్ట్ గా నిలిచారని, ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఇస్తారని తెలిపారు. అయితే ఇంత మంది పాన్‌ ఇండియా హీరోలను పరిచయం చేసిన అశ్వినీదత్‌.. ఇండియన్‌ బిగ్గెస్ట్ హీరో ప్రభాస్‌తో మొన్నటి వరకు సినిమా చేయలేదు. ఈ బ్యానర్‌ స్థాపించిన యాభై ఏళ్లకిగాను `కల్కి` చేశాడు. తన బ్యానర్‌లోనే బిగ్గెస్ట్ మూవీని తెరకెక్కించారు. ఈ రకంగా వైజయంతి మూవీస్‌, నిర్మాత అశ్వినీదత్ ప్రత్యేకంగా నిలిచారు. 
 

click me!