మహేష్ బాబు ఒక్కడికే ఆయన వాయిస్ సెట్ కాలేదు.. మూవీ కూడా డిజాస్టర్..

By tirumala AN  |  First Published Sep 30, 2024, 4:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి చిత్రంలో కథకి న్యాయం చేసేలా పెర్ఫామ్ చేస్తాడు. చివరికి 1 నేనొక్కడినే, ఖలేజా లాంటి ఫ్లాప్ చిత్రాల్లో కూడానా మహేష్ నటనలో ఎంతో ఇంటెన్సిటీ ఉంటుంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి చిత్రంలో కథకి న్యాయం చేసేలా పెర్ఫామ్ చేస్తాడు. చివరికి 1 నేనొక్కడినే, ఖలేజా లాంటి ఫ్లాప్ చిత్రాల్లో కూడానా మహేష్ నటనలో ఎంతో ఇంటెన్సిటీ ఉంటుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటుడిగా మహేష్ ఎప్పుడూ నిరాశ పరచలేదు. 

మహేష్ బాబు తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం 

మహేష్ బాబు తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రాల్లో 'నిజం' కూడా ఒకటి. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మహేష్ బాబు నటించిన ప్రయోగాత్మక చిత్రం ఇది. ప్రభుత్వాలలో జరుగుతున అవినీతికి వ్యతిరేకంగా తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ కి జోడిగా రక్షిత నటించింది. ఈ చిత్రం విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. అందులో ఒకటి హీరోయిన్ రాశి నెగిటివ్ రోల్ లో నటించడం. దీనికి తోడు ఫ్యామిలీ ఆడియన్స్ జీర్ణించుకోలేని విధంగా తేజ ఆమె పాత్రని తీర్చి దిద్దారు. తన కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు నిజం చిత్రంలో నటించడం అని రాశి చాలా సందర్భాల్లో తెలిపింది. 

యువ హీరోలకు ఆర్పీ పట్నాయక్ అద్భుతమైన సంగీతం 

Latest Videos

నిజం చిత్రం విషయంలో మరో మిస్టేక్ కూడా జరిగిందట. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. తేజ, ఆర్పీ పట్నాయక్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఆర్పీ పట్నాయక్ అద్భుతమైన గాయకుడు కూడా. ఉదయ్ కిరణ్, తరుణ్, నితిన్ ఇలా ఎందరో యువ హీరోల చిత్రాలకు సంగీతం అందించి పాటలు పాడారు. అందరి హీరోలకు ఆర్పీ పట్నాయక్ గాత్రం బాగా సెట్ అయ్యేది. 

మహేష్ కి నా వాయిస్ సెట్ కాలేదన్న ఆర్పీ పట్నాయక్ 

కానీ మహేష్ బాబుకి మాత్రం ఆర్పీ పట్నాయక్ వాయిస్ సెట్ కాలేదు. ఈ విషయాన్ని ఆర్పీ పట్నాయక్ స్వయంగా అంగీకరించారు. నిజం మూవీ ఫ్లాప్ కావడంతో మ్యూజిక్ పై కామెంట్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ నా వాయిస్ టీనేజ్ కుర్రాడిలా ఉంటుంది. మహేష్ వాయిస్ లో ఇంటెన్సిటీ ఎక్కువ. కాబట్టి మా ఇద్దరికీ మ్యాచ్ కాలేదు అని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఆర్పీ పట్నాయక్ తన కెరీర్ లో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, దిల్, జయం లాంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. 

ఆర్పీ పట్నాయక్ నటుడిగా కూడా రాణించారు. ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో ఆర్పీ పట్నాయక్ కి మంచి ప్రావీణ్యం ఉంది. తనకి కథ నచ్చితేనే ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద దర్శకుడు అయినా అంగీకారం చెబుతా అని ఆర్పీ పట్నాయక్ అన్నారు. కథ నచ్చకపోతే అది ఎవరైనా సరే మ్యూజిక్ చేయను. నాలో ఆ సంగీత సరస్వతి బయటకి రాదు అని పట్నాయక్ తెలిపారు. 

రాజమౌళి చిత్రానికి మహేష్ రెడీ 

నిజం లాంటి ప్రయోగాలని మహేష్ బాబు ఆ తర్వాత చేయలేదు. మహేష్ బాబు నటనకి మాత్రం ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మహేష్ రాజమౌళి చిత్రం భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతోంది. మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో సందడి చేశారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి చిత్రం కోసం తన మేకోవర్ మార్చుకుంటున్నారు. కొన్ని నెలలుగా మహేష్ అదే పనిలో ఉన్నారు. 

ఇటీవల మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు అందరిని షాక్ కి గురిచేశాయి.  ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మహేష్ బాబు మారిపోయాడు. మరీ వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. జక్కన్న పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు అంటూ మహేష్ బాబు లుక్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటవీ నేపథ్యంలో వరల్డ్ మొత్తం చుట్టివచ్చే వీరుడి కథ అంటూ ఆల్రెడీ హింట్స్ వచ్చాయి. వైల్డ్ లైఫ్ లో జరిగే కథ కాబట్టి లుక్ కూడా వైల్డ్ గా ఉండబోతోందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

click me!