మాజీ మిస్‌ ఇండియా వరల్డ్ కి కరోనా..

Published : Aug 09, 2020, 09:05 PM ISTUpdated : Aug 09, 2020, 09:47 PM IST
మాజీ మిస్‌ ఇండియా వరల్డ్ కి కరోనా..

సారాంశం

మరోమాజీ విశ్వ సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్ ఇండియా వరల్డ్, ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న నటాషా సూరికి కరోనా సోకింది. ఆరు రోజుల క్రింద అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను. అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది. 

కరోనా సినీ సెలబ్రిటీలను వెంటాడుతుంది. ఇప్పటికే చాలా మంది తారలు వైరస్‌కి గురయ్యారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుటుంబం అభిషేక్‌ బచ్చన్‌, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌, ఆరాధ్య, అనుపమ్‌ ఖేర్‌, నవనీత్‌ కౌర్‌, అలాగే తెలుగులో రాజమౌళి కుటుంబం, దర్శకుడు తేజ, డివివి దానయ్య, బండ్ల గణేష్‌, సింగర్‌ స్మిత వంటి వారికి వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. వీరిలో దాదాపు అందరూ కోలుకున్నారు. 

ఈ క్రమంలో మరోమాజీ విశ్వ సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్ ఇండియా వరల్డ్, ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న నటాషా సూరికి కరోనా సోకింది. ఆరు రోజుల క్రింద అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను. అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది. గొంతు నొప్పి, వీక్ నెస్ కూడా ఆవహించింది. అనుమానం వచ్చి మూడు రోజుల కిందట టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను. నాకు ఇప్పటికీ జ్వరం, నీరసం ఉన్నాయి` అని తనకు కరోనా సోకిన విషయాన్ని నటాషా సూరి ప్రకటించింది. 

ప్రస్తుతం తను తన అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఉంటోంది. కాబట్టి వాళ్లకు కూడా పరీక్షలు చేయించానని చెప్పుకొచ్చింది. వైద్యుల సలహా మేరకు మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లు తీసుకుంటున్నానని తెలిపిందీ మాజీ అందాల సుందరి. ముంబయికి చెందిన ఈ సెక్సీ భామ 2005లో నేవీ క్వీన్‌గా, మిస్‌ మహారాష్ట్ర విన్నర్‌గా నిలిచింది. 2006లో మిస్‌ ఇండియా వరల్డ్ విన్నర్‌గా నిలిచింది. అలాగే మిస్‌ వరల్డ్ సెమిఫైనల్‌ వరకు వెళ్ళింది. 

2016లో మలయాళ చిత్రం `కింగ్‌ లియర్‌` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు, హిందీలో `బా బా బ్లాక్‌ షీప్‌`, `వర్జిన్‌ భనుప్రియా` చిత్రాల్లో నటించింది. ఇక ఆమె నటించిన హిందీ చిత్రం 'డేంజరస్' ఈ నెల 14ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇందులో కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు కీలక పాత్రలు పోషించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్