మహేష్‌ దెబ్బకి పాత రికార్డులన్నీ బ్రేక్‌.. ఏం చేశాడో తెలుసా?

Published : Aug 09, 2020, 08:30 PM ISTUpdated : Aug 09, 2020, 09:48 PM IST
మహేష్‌ దెబ్బకి పాత రికార్డులన్నీ బ్రేక్‌.. ఏం చేశాడో తెలుసా?

సారాంశం

ఆదివారం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 45వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల వేడుకలకు దూరంగా, చాలా నిరాడంబరంగా తన బర్త్ డే వేడుకని జరుపుకున్నారు మహేష్‌. తన అభిమాన హీరోని కలవలేకపోయిన మహేష్‌ అభిమానులు తమ చేతుల్లో ఉన్న సోషల్‌ మీడియాని వాడుకున్నారు.

మహేష్‌బాబు హంగామా మామూలుగా లేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా మొత్తం మహేష్‌ సందడి చేస్తున్నాడు. `హ్యాపీబర్త్ డే మహేష్‌బాబు` యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేస్తుంది. అభిమానులు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నారు. తాజాగా ఇది కేవలం ఒక్కరోజులోనే దాదాపు 60మిలియన్‌ ట్వీట్స్ ని దాటి టాలీవుడ్‌లో పాత రికార్డులన్నింటిని బ్రేక్‌ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాదు ప్రపంచ రికార్డుని సృష్టిస్తుంది. మరిన్ని సంచలనాలకు తెరలేపింది. 

ఆదివారం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 45వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల వేడుకలకు దూరంగా, చాలా నిరాడంబరంగా తన బర్త్ డే వేడుకని జరుపుకున్నారు మహేష్‌. తన అభిమాన హీరోని కలవలేకపోయిన మహేష్‌ అభిమానులు తమ చేతుల్లో ఉన్న సోషల్‌ మీడియాని వాడుకున్నారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. సోషల్‌ మీడియా పగిలిపోయేలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. బర్త్ డే ట్యాగ్‌ని ట్రెండ్‌ అయ్యేలా చేశారు. తాజాగా హ్యాపీ బర్త్ డే మహేష్‌ యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో నెంబర్‌ వన్‌గా ట్రెండ్‌ అవుతుంది.

దీంతో మహేష్‌బాబు స్టామినా ఏంటో నిరూపించింది. ఇదిలా ఉంటే మహేష్‌కి అనేక మంది సినీ సెలబ్రిటీలు బర్త్ డే విశెష్‌ తెలిపిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా చిరంజీవి తెలిపిన విశెష్‌, అలాగే తన భార్య, నటి నమ్రత తనకు ముద్దు పెట్టిన ఫోటో పంచుకుంటూ తెలిపిన విశెష్‌ హైలైట్‌గా నిలిచింది. 
 
మరోవైపు ప్రస్తుతం మహేష్‌బాబు.. పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్‌ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ని మహేష్‌ బర్త్ డేని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. ఇది కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్