''ఇదే స్కిన్ షో అక్కడ చేస్తే డబుల్ పేమెంట్..''

Published : Apr 12, 2019, 12:12 PM IST
''ఇదే స్కిన్ షో అక్కడ చేస్తే డబుల్ పేమెంట్..''

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటికి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటికి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే రీసెంట్ గా ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా ట్రైలర్, పాటలు చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. 

దానికి కారణం ఆమె ఆ హిందీ సినిమాలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాల ఆరబోత చేసింది. తెలుగు సినిమాల పట్ల ఈ నటి చూపించే ప్రేమ అపారమైనది. కానీ ఆమెది బిజినెస్ మైండ్ కావడంతో ప్రతీ విషయాన్ని డబ్బులతో లింక్ పెట్టి చూసుకుంటుంది.

ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో టూ మచ్ గ్లామర్ షో చేయడానికి కారణం కూడా డబ్బే అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె తన సన్నిహితుల వద్ద చెబుతోందట. తెలుగు సినిమాల్లో తన పాత్రలు సింపుల్ గా ఉండి, పాటల్లో మాత్రం గ్లామర్ షో ఎక్కువ చేయాలని డిమాండ్ చేస్తుంటారని.. అదే స్కిన్ షో బాలీవుడ్ లో చేస్తే పేమెంట్ డబుల్ ఉంటుందని  చెబుతోందట.

సినిమా సక్సెస్ అయితే తన మార్కెట్, ఆఫర్లు కూడా పెరుగుతాయని అమ్మడు భావిస్తోంది. ఆ కారణంగానే స్కిన్ షో విషయంలో ఎలాంటి షరతులు విధించడం లేదట. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?